Tue Dec 24 2024 02:08:39 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ లో మరో విషాదం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత
లంకేశ్వరుడు, గోవిందా గోవిందా, బంగారు బుల్లోడు, ముఠా మేస్త్రి, హలో బ్రదర్, మెకానిక్ అల్లుడు, ఖైదీ నంబర్ 786..
టాలీవుడ్ లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్(68) గుండెపోటుతో హైదరాబాద్ లోని తన స్వగృహంలో మరణించారు. ఆయన మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. టాలీవుడ్ రాజ్-కోటి ద్వయం ఎంతో ఫేమస్. నిజానికి అవి రెండుపేర్లులా, ఇద్దరు మనుషుల్లా అసలు అనిపించేవారు కాదు. రాజ్ -కోటి అంటే.. ఒక్కరే.
సంగీత దర్శకుడు కోటితో కలిసి రాజ్ సుమార్ 180 సినిమాలకు సంగీతం అందించారు. తెలుగులో వీరిద్దరిదీ హిట్ కాంబినేషన్. లంకేశ్వరుడు, గోవిందా గోవిందా, బంగారు బుల్లోడు, ముఠా మేస్త్రి, హలో బ్రదర్, మెకానిక్ అల్లుడు, ఖైదీ నంబర్ 786, యముడికి మొగుడు, సీతారత్నంగారి అబ్బాయి, జంబలకిడి పంబ, ఏవండోయ్ ఆవిడొచ్చింది, మామగారు, చిక్కడు దొరకడు, పేకాట పాపారావు తదితర సినిమాలకు రాజ్ - కోటి సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు. 90వ దశకంలో ఈ ద్వయం పేరు మారుమ్రోగింది.
కొన్నేళ్ల క్రితం రాజ్ - కోటి లు మనస్ఫర్థల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత ఎక్కువగా సినిమాలు చేయలేదు. రాజ్ సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. రాజ్ సింగిల్ గా.. సిసింద్రీ, రాముడొచ్చాడు, ప్రేమంటే ఇదేరా.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. చాలాకాలం తర్వాత రాజ్ - కోటి కలిసి బేబీ సినిమాలో ఓ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో కనిపించారు.
Next Story