Fri Dec 20 2024 06:18:21 GMT+0000 (Coordinated Universal Time)
2023 Rewind : ఈ ఏడాది అదుర్స్ అనిపించిన కొత్త దర్శకులు..
ఈ ఏడాది అరడజనకు పైగా కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మరి ఆ కొత్త దర్శకులు ఎవరో..? వాళ్ళు తీసిన సినిమాలు ఏంటో
2023 Rewind : ఈ ఏడాది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ఎవరూ బాక్స్ ఆఫీస్ వద్దకి రాలేదు. కానీ కొత్త దర్శకుల ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. ఈ ఏడాది అరడజనకు పైగా కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఎంట్రీ ఇస్తూనే సూపర్ హిట్స్ ని తమ ఖాతాలో వేసుకున్నారు. మరి ఆ కొత్త దర్శకులు ఎవరో..? వాళ్ళు తీసిన సినిమాలు ఏంటో చూసేయండి..
షణ్ముఖ ప్రశాంత్..
సుహాస్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘రైటర్ పద్మభూషణం’. షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన ఈ సినిమా.. ఇంటిలో లేడీస్ కి కూడా ఏదో సాధించాలనే డ్రీమ్స్ ఉంటాయి అనే కాన్సెప్ట్ తో అందరి మనసుని దోచుకుంది. కేవలం నాలుగు కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 12 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
మురళి కిషోర్ అబ్బుర..
కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ‘వినరో భాగ్యము విష్ణుకథ'.. ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. మురళి కిషోర్ అబ్బుర డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సుమారు ఆరు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద 11 కోట్ల పైనే కలెక్షన్స్ ని రాబట్టింది.
జబర్దస్త్ వేణు..
జబర్దస్త్ లో తన కామెడీ స్క్రిప్ట్స్ తో అందర్నీ నవ్వించిన వేణు.. ‘బలగం’ సినిమా స్క్రిప్ట్ తో అందర్నీ ఏడిపించాడు. ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మూడు కోట్లతో రూపొంది 26 కోట్లకు పైగా వసూళ్లు చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు పలు అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకుంది.
శ్రీకాంత్ ఓదెల..
నాని ఈ ఏడాది ఇద్దరి కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అందులో ఒకరు దసరా సినిమా డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ ఓదెల. నానిని ఊర మాస్ క్యారెక్టర్ లో చూపిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. 65 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 117 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
సుమంత్ ప్రభాస్..
షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్.. తానే నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'మేమ్ ఫేమస్'. మూడు కోట్ల బడ్జెట్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద 5 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని హిట్టు బొమ్మగా నిలిచింది.
క్లాక్స్..
ఆర్ఎక్స్100 తరువాత సరైన హిట్ లేని కార్తికేయకు ‘బెదురులంక 2012’ సినిమాతో హిట్టు బొమ్మని అందించిన దర్శకుడు 'క్లాక్స్'. దాదాపు 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద 16 కోట్ల వరకు కలెక్షన్స్ ని అందుకొని సూపర్ హిట్టుగా నిలిచింది.
కళ్యాణ్ శంకర్..
టాలీవుడ్ లో చాలా కాలం తరువాత ఒక కాలేజీ బ్యాక్డ్రాప్ కథతో వచ్చిన సినిమా 'మ్యాడ్'. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 5 కోట్లతో తెరకెక్కి 24 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.
శౌరవ్..
నాని పరిచయం చేసిన రెండో దర్శకుడు 'శౌరవ్'. హాయ్ నాన్నతో ఆడియన్స్ ని ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఎక్కించేశారు. 40 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 72 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది.
Next Story