Wed Dec 25 2024 05:31:54 GMT+0000 (Coordinated Universal Time)
Tollywood Updates : ఏంటి ఈరోజు ఇన్ని అప్డేట్స్ వచ్చాయా..?
ఈరోజు టాలీవుడ్ లో వరుస అప్డేట్స్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. సాంగ్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ అంటూ కొత్త సినిమాలు సందడి.
ఈరోజు టాలీవుడ్ లో వరుస అప్డేట్స్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. సాంగ్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ అంటూ కొత్త సినిమాలు సందడి చేశాయి. ఇంతకీ ఈరోజు రిలీజ్ అయిన ఆ అప్డేట్స్ ఏంటి..?
కన్నడ ఇండస్ట్రీ నుంచి గత ఏడాది ఒక చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా హిట్టుని అందుకున్న 'కాంతార' మూవీకి కొనసాగింపుగా మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. కాంతారకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇక ఆ గ్లింప్స్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తుంది.
నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం 'హరోంహర'. జ్ఞానసాగర్ ద్వారకా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 1980'స్ బ్యాక్‌డ్రాప్ లో ఒక పీరియాడిక్ రూరల్ గ్యాంగ్‌స్టార్ చిత్రంగా రూపొందుతుంది. మాళవిక శర్మ ఈ సినిమాలో సుధీర్ బాబుకి జోడిగా కనిపించబోతున్నారు. నేడు ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. మరి ఆ ట్రైలర్ వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.
ఇక సిద్దు జొన్నలగడ్డని సింగల్ నైట్ లో స్టార్ చేసేసిన 'డీజే టిల్లు'కి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టిల్లు స్క్వేర్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ నుంచి సాంగ్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా సెకండ్ సాంగ్ 'రాధికా' రిలీజ్ చేశారు.
కొన్నాళ్ల నుంచి ఒక్క హిట్టు కోసం కష్టపడుతున్న నితిన్.. కొంత కాలం నుంచి ప్లాప్‌ల్లో ఉన్న రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీతో కలిసి చేస్తున్న సినిమా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ పాత్రలో ఆడియన్స్ ని నవ్వించబోతున్నారు. నేడు రిలీజ్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.
అలాగే కళ్యాణ్ రామ్ నటిస్తున్న 'డెవిల్' మూవీ నుంచి కూడా సాంగ్ ని రిలీజ్ చేశారు. బ్రిటిష్ టైం పీరియడ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక సాంగ్ రిలీజ్ చేయగా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇప్పుడు మరో సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
Next Story