Mon Dec 23 2024 05:47:56 GMT+0000 (Coordinated Universal Time)
టైం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తోన్న విజయ్ - రష్మిక
వాళ్లిద్దరూ కలిసి చేసింది రెండు సినిమాలే. అయినా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. దానికి నెటిజన్లు ఏ పేరు పెట్టినా.. వాళ్లు మాత్రం మేం మంచి స్నేహితులమని చెప్తుంటారు. ఇప్పుడు ఆ ఇద్దరూ ముంబై లో ప్రత్యక్షమయ్యారు. వాళ్లే విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో ఆన్ స్క్రీన్ సూపర్ పెయిర్ గా మంచి పేరు తెచ్చుకున్న వీరిద్దరు.. సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తుంటారు. డిన్నర్లు, లంచ్ లు, పార్టీలు.. ఇలా ఏదోరకంగా కలుస్తూ ఉంటారు.
ముంబైలో డిన్నర్
తాజాగా వీరిద్దరూ ముంబైలో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆదివారం రాత్రి ముంబై బాంద్రాలోని ఓ రెస్టారెంట్ లో ఈ జంట డిన్నర్ కు వెళ్లింది. దాంతో అక్కడున్న కొంతమంది వీరిని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక చాలారోజుల తర్వాత విజయ్-రష్మిక కలిసి కనిపించడంతో అభిమానులు ఆనందపడిపోతున్నారు. వీరి కాంబినేషన్లో ఇంకో సినిమా రావాలని కోరుకుంటున్నారు. విజయ్ ప్రస్తుతం పూర్తి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లైగర్ లో నటిస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతోంది. ఇక రష్మిక నటించిన పుష్ప సినిమా ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
Next Story