Sun Dec 22 2024 21:24:17 GMT+0000 (Coordinated Universal Time)
హనుమాన్.. ట్రైలర్ వచ్చేస్తోంది
ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే
టాలీవుడ్ నుండి పాన్ వరల్డ్ సినిమా వచ్చేస్తోంది. అదే 'హనుమాన్'. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే పాటలు.. సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా ట్రైలర్ విడుదల ఎప్పుడన్నది కన్ఫర్మ్ చేశారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న 'హను-మాన్' థియేట్రికల్ ట్రైలర్ డిసెంబర్ 19న విడుదల కాబోతోంది. హను-మాన్ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి భాగం. టీజర్తో ఈ సినిమాకు జాతీయ స్థాయి క్రేజ్ ఏర్పడింది. మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక హను-మాన్ ట్రైలర్ను డిసెంబర్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ట్రైలర్ అంజనాద్రి ఫాంటసీ ప్రపంచంలోకి మనల్ని తీసుకుని వెళ్లబోతోంది.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను శివేంద్ర చూసుకున్నారు. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలో మెరిపించనున్నారు. జనవరి 12, 2024న భారతీయ భాషల్లోనే కాకుండా.. ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Next Story