Mon Dec 15 2025 06:28:19 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ సీఎం జగన్ పై పూనమ్ కౌర్ ట్వీట్.. నెట్టింట వైరల్
టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు

టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. అయితే ఆమె స్పందన మాత్రం భిన్నంగా ఉంది . "వై నాట్ 175 అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు’ అని ట్వీట్ చేసింది. దీనికి #andhrapradesh అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేసింది. పూనమ్ షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అధికారంలోకి రాబోతున్న టీడీపీ, జనసేన కూటమి కి సుగాలి ప్రీతి కేసును త్వరగా పరిష్కరించాలంటూ కోరింది.
అందరూ కలిసుండాలని...
దీంతో పాటు మరో ట్వీట్ కూడా పూనమ్ కౌర్ చేసింది. ఈసారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలసి పోవాలని ఆకాంక్షించింది. జగన్ మరింత బలోపేతం కావాలని తెలిపింది. 2019 ఎన్నికల్లో జగన్ విజయానికి కారకులైన వారంతా ఇప్పుడు కలిసుండాలని తానుకోరుకుంటున్నానని ట్వీట్ చేసింది. ఆ ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి చేసిన కృషిని పూనమ్ కౌర్ ప్రశంసించింది. సహనం, పట్టుదలతో అంతా ఒక్కటవ్వాలని కోరుకుంది ఈ అమ్మడు.
Next Story

