Wed Dec 25 2024 15:45:46 GMT+0000 (Coordinated Universal Time)
వైజయంతి నిర్మాతలు వార్నింగ్.. చిరంజీవికి ఇచ్చిందా..?
వైజయంతి మూవీస్ ప్రొడ్యూసర్స్.. చిరంజీవికి వార్నింగ్ ఇచ్చారా..? అసలు ఏమైంది..?
వైజయంతి మూవీస్ ప్రొడ్యూసర్స్.. ప్రస్తుత తమ నిర్మాణ సంస్థ వ్యవహారాల్లో చాలా కఠిన చర్యలు తీసుకు వస్తున్నారు. ఇటీవల ప్రభాస్ 'కల్కి' మూవీకి సంబంధించిన ఒక ఫోటో.. గ్రాఫిక్స్ డిజైన్ కంపెనీ నుంచి లీక్ అవ్వగా వారిపై లీగల్ గా యాక్షన్ తీసుకున్నారు. అంతేకాదు, భవిషత్తులో ఇలాంటి లీక్స్ మళ్ళీ జరగకుండా ఆడియన్స్ కి, ఫిలిం వర్గాల ప్రతినిధులకు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా ఈ నిర్మాతల నుంచి మరో వార్నింగ్ వచ్చింది.
ఈసారి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా విషయంలో వార్నింగ్ ఇచ్చారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి కలయికలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని వైజయంతి బ్యానర్ నిర్మించింది. ఇక ఈ మూవీ విషయంలోనే ఇప్పుడు.. ఇన్‌డైరెక్ట్‌గా చిరంజీవికి వార్నింగ్ వెళ్లినట్లు తెలుస్తుంది. అదేంటి ఎప్పుడో రిలీజ్ అయిన మూవీ గురించి ఇప్పుడు వార్నింగ్ ఇవ్వడం ఏంటని ఆలోచిస్తున్నారా..?
అసలు విషయం ఏంటంటే.. బింబిసారా దర్శకుడు వశిష్ఠతో చిరంజీవి తన 157వ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సోషియో ఫాంటసీ డ్రామాతో ఉండబోతుందంటూ ఆల్రెడీ తెలియజేశారు. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ఠ మాట్లాడుతూ.. ఈ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలో ఉంటుందని పేర్కొన్నాడు. దీంతో ఫిలిం వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొట్టడం మొదలైంది. జగదేకవీరుడు స్టోరీ లైన్ తోనే Mega157 రాబోతుందని, సీక్వెల్ అని.. ఇలా వార్తలు రావడం మొదలయ్యాయి.
ఇక ఈ విషయం గురించే వైజయంతి మేకర్స్ ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఉండవచ్చు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ నోట్ లో ఏముందంటే.. "జగదేకవీరుడు అతిలోకసుందరి కంప్లీట్ కాపీ రైట్స్ మాకు మాత్రమే ఉన్నాయి. ఆ సినిమా కంటెంట్ ని ఉపయోగించుకొని సీక్వెల్, ప్రీక్వల్ లేదా వెబ్ సిరీస్ తియ్యాలన్నా మా అంగీకారం తప్పక తీసుకోవాలి. మా అంగీకారం లేకుండా ఎవరైన ఆ సినిమా కంటెంట్ ని ఉపయోగించుకుంటే.. వారి పై లీగల్ యాక్షన్ తీసుకుంటాము" అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్నింగ్ నోట్ హాట్ టాపిక్ గా మారింది.
Next Story