Mon Dec 23 2024 07:33:57 GMT+0000 (Coordinated Universal Time)
Bandla Ganesh : బండ్ల గణేష్కు ఏడాది జైలు శిక్ష..
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95.10 లక్షల జరిమానా విధించిన కోర్టు.
Bandla Ganesh : టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన సినిమాలతో కంటే తన స్పీచ్ లతో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నారు. సినీ, రాజకీయ అంశాలు పై వైరల్ కామెంట్స్ చేస్తూ ట్రెండ్ అవుతుంటారు. అయితే తాజాగా ఈ నిర్మాత జైలు మెట్లు ఎక్కుతున్నారు. బండ్ల గణేష్ కి న్యాయస్థానం ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95.10 లక్షల జరిమానా కూడా విధించారు.
అసలు ఏం జరిగిందంటే.. జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ 95 లక్షల రూపాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక ఈ అప్పుని చెల్లించే క్రమంలో బండ్ల గణేష్.. జెట్టి వెంకటేశ్వర్లుకి చెక్ రూపంలో నగదు ఇచ్చారు. అయితే ఆ చెక్ మార్చడం కోసం బ్యాంకుకి వెళ్లగా అది బౌన్స్ అయ్యింది. దీంతో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఇక కేసుని విచారించిన న్యాయస్థానం.. సాక్ష్యాలు బట్టి బండ్ల గణేష్ ని నేరస్తుడిగా పరిగణించి శిక్షని విధించింది. ఏడాది జైలు శిక్షని బండ్ల గణేష్ కి విధించిన కోర్టు.. రూ.95.10 లక్షల జరిమానా కట్టాలని పేర్కొంది. ఈ జరిమానాలోని 95 లక్షలు ఫిర్యాదికి పరిహారంగా చెల్లించాలంటూ తీర్పునించింది. ఇక ఈ తీర్పుని అప్పీలు చేసుకునేందుకు బండ్ల గణేష్ కి నెలరోజుల గడువు ఇచ్చింది.
Next Story