Sun Mar 30 2025 07:36:16 GMT+0000 (Coordinated Universal Time)
హీరో నాని వ్యాఖ్యలను తప్పుపట్టిన టాలీవుడ్ నిర్మాత
నానికి ఏం తెలుసని మాట్లాడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. నాని కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వాన్ని

ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే.. అది సినిమా టికెట్ల అంశమే. ఈ విషయమై నేచురల్ స్టార్ నాని స్పందించిన సంగతి తెలిసిందే. సినిమా థియేటర్ల కంటే కిరాణా షాపుల కలెక్షన్లే బాగున్నాయని, టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం సముచితం కాదని నాని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ తప్పుబట్టారు. నానికి ఏం తెలుసని మాట్లాడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. నాని కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని నట్టికుమార్ పేర్కొన్నారు.
క్షమాపణలు చెప్పాలి..
సినిమా టికెట్ల రేట్లు, వసూళ్లు, షేర్ వంటి విషయాలపై నానికి కనీస అవగాహన లేదని విమర్శించారు. ఈ అంశంపైనే తాము ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్న ఆయన.. మరోవైపు కోర్టులోనూ ఈ వ్యవహారం నడుస్తోందని గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో నాని చేసిన వ్యాఖ్యల ప్రభావం మిగతా సినిమాలపై పడుతుందన్నారు. నాని ఏపీ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ.. క్షమాపణలు చెప్పాలని నిర్మాత నట్టికుమార్ డిమాండ్ చేశారు.
Next Story