Fri Dec 20 2024 05:13:43 GMT+0000 (Coordinated Universal Time)
Ram Charan : ఎన్టీఆర్తో పాటు చరణ్ సినిమాకి కూడా నో చెప్పిన నటుడు..
ఎన్టీఆర్తో పాటు చరణ్ సినిమాకి కూడా నో చెప్పిన ఆ సీనియర్ నటుడు ఎవరో తెలుసా..?
Ram Charan : గ్లోబల్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో నటించేందుకు చాలామంది నటులు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఒక సీనియర్ యాక్టర్ మాత్రం, ఆ ఛాన్స్ వచ్చినా.. మరో ఆలోచన లేకుండా నో చెప్పేస్తున్నారు. అయితే ఆ సీనియర్ నటుడు ఎన్టీఆర్ సినిమాకి నో చెప్పింది ఆర్ఆర్ఆర్ సినిమాకి ముందు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ విషయానికి వస్తే.. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ RC16.
ఇంతకీ ఆ సీనియర్ నటుడు ఎవరంటే.. పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. RC16 సినిమా గోదావరి గ్రామాల బ్యాక్డ్రాప్ లో రీజినల్ స్టోరీతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో నటీనటుల కోసం బుచ్చిబాబు ప్రస్తుతం యాక్టర్స్ ని వెతుకుతున్నారు. ఈక్రమంలోనే మూవీలోని ఓ ముఖ్య పాత్ర కోసం ఆర్ నారాయణమూర్తిని సంప్రదించారట. అయితే ఆయన నో చెప్పేశారట.
బుచ్చిబాబు ఎంత బ్రతిమాలినా ఆయన ఒప్పుకోలేదట. గతంలో ఎన్టీఆర్ 'టెంపర్' సినిమాలో కూడా నారాయణమూర్తి నటించాల్సి ఉంది. కానీ అప్పుడు నో చెప్పారు. అందుకు ఆయన రీజన్ కూడా చెప్పుకొచ్చారు. తాను హీరోగా ఎదగడం కోసం ఎంతో కష్టపడ్డానని, చివరి వరకు కూడా హీరోగానే కొనసాగుతానని, జనాలు తనని అలాగే గుర్తు పెట్టుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంతోనే ఆయన ఎన్ని ఆఫర్స్ వస్తున్నా నో చెబుతూ వస్తున్నారు.
ఇక RC16 విషయానికి వస్తే.. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది. ఇక చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ ఎంపిక అయ్యిందని సమాచారం. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Next Story