Mon Dec 23 2024 05:57:33 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ పై కన్నేసిన కరోనా.. శ్రీకాంత్ కు పాజిటివ్ !
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం సినీ ఇండస్ట్రీపై తీవ్రంగానే ఉంటోంది. సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. బాలీవుడ్
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం సినీ ఇండస్ట్రీపై తీవ్రంగానే ఉంటోంది. సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా.. అన్ని ఇండస్ట్రీల సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి, కొరియో గ్రాఫర్ అనీ మాస్టర్ తమకు కరోనా నిర్థారణ అయినట్లు ప్రకటించారు. వీరిద్దరికీ కరోనా సోకడం ఇది రెండవసారి. తాజాగా ప్రముఖ నటుడు శ్రీకాంత్ కూడా తనకు కరోనా నిర్థారణ అయినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. కరోనా వదల్లేదని, టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్థారణ అయిందని చెప్పుకొచ్చారు. రెండ్రోజులుగా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నట్లు తెలిపారు శ్రీకాంత్. ఇటీవల తనను కలిసిన వారు కూడా కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News Summary - tollywood senior Actor Srikanth Tested positive for covid 19
Next Story