Mon Dec 23 2024 07:35:48 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ సీనియర్ పబ్లిసిటీ ఇన్ఛార్జ్ ప్రమోద్ కుమార్ కన్నుమూత
విజయవాడలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమోద్ కుమార్ 38 ఏళ్ల పాటు సినీరంగంలో..
టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రముఖ నటీనటులను, దర్శకులను కోల్పోయిన టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. 300కి పైగా సినిమాలకు పబ్లిసిటీ ఇన్ ఛార్జిగా పనిచేసిన వీరమాచనేని ప్రమోద్ కుమార్ (87) కన్నుమూశారు. విజయవాడలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమోద్ కుమార్ 38 ఏళ్ల పాటు సినీరంగంలో పబ్లిసిటీ ఇన్ ఛార్జిగా కొనసాగారు. ప్రమోద్ పబ్లిసిటీ అందించిన సినిమాల్లో 31 సినిమాలు శతదినోత్సవ వేడుకలను జరుపుకున్నాయి.
కాగా.. పబ్లిసిటీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తూనే.. కొన్ని సినిమాల్లోనూ ఆయన నటించారు. మోహన్ బాబు నటించిన దొంగపోలీస్, గరం మసాలా చిత్రాలకు నిర్మాతగా ఉన్నారు. తెరవెనుక తెలుగు సినిమా అనే పుస్తకాన్ని కూడా రచించారు. సుబ్బయ్య గారి మేడ పేరుతో ఓ నవల కూడా రాశారు. ఆయనకు తులసి రాణి, సరోజ అనే ఇద్దరు కుమార్తెలు, శ్రీనివాస్ రాయ్ అనే కుమారుడు ఉన్నారు.
Next Story