Sun Dec 22 2024 17:30:27 GMT+0000 (Coordinated Universal Time)
గోషా మహల్ టికెట్ రచ్చ.. క్లారిటీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు
టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని రాహుల్ సిప్లిగంజ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని రాహుల్ సిప్లిగంజ్ ఖండించారు. ఎన్నికల్లో పోటీచేయాలని తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని.. తాను రాజకీయాల్లోకి రావట్లేదని అన్నారు. తనకు అన్ని పార్టీలు, అందరు నాయకులంటే గౌరవముందన్నారు. తానొక ఆర్టిస్టునని, ఎంటర్టైన్ చేయడమే తన బాధ్యత అన్నారు.
“అందరికీ నమస్కారం! నేను ఏ రాజకీయాల్లోనూ లేనని, గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చాలా పుకార్లు వచ్చాయి. అవన్నీ గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న ఫేక్ న్యూస్. అది అస్సలు నిజం కాదు. నేను అన్ని పార్టీలకు చెందిన నాయకులందరినీ గౌరవిస్తాను ఎందుకంటే నేను ఒక కళాకారుడిని. నేను అందరినీ అలరించాలి.. ఇది నేను నా జీవితాంతం చేస్తాను. తన దృష్టి అంతా మ్యూజిక్ కెరీర్‌పైనే ఉంటుందన్నారు. “నేను నా సంగీత వృత్తిలో మాత్రమే ఉన్నాను. ఈ పరిశ్రమలో నేను చేయాల్సింది చాలా ఉంది. ఏ పార్టీ నుంచి నన్ను ఎవరూ సంప్రదించలేదు, నేను ఎవరినీ సంప్రదించలేదు. దయచేసి ఇలాంటి పుకార్లు ఆపండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి” అని తన అభిమానులను కోరారు. రాహుల్ సిప్లిగంజ్ ప్రకటనతో ఊహాగానాలకు తెరపడింది.
Next Story