Sat Dec 21 2024 14:12:57 GMT+0000 (Coordinated Universal Time)
Uppena : 'ఉప్పెన'లో ఆ స్టార్ హీరో కూతురు హీరోయిన్గా చేయాల్సింది.. కానీ..!
'ఉప్పెన'లో ఆ స్టార్ హీరో కూతురు హీరోయిన్గా చేయాల్సింది.. కానీ ఆమె నో చెప్పిందట. ఇంతకీ ఆ స్టార్ హీరో వారసురాలు ఎవరు..?
Uppena : మెగా వారసుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన సినిమా 'ఉప్పెన'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా డెబ్యూట్ ఇస్తూ చేసిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డెబ్యూట్ మూవీతోనే 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారసుల్లో వైష్ణవ తేజ్ రికార్డు సృష్టించాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ కృతిశెట్టి ఆడియన్స్ కి పరిచయమైన సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో కృతి టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్డమ్ ని సంపాదించుకున్నారు. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటూ హీరోయిన్ గా బిజీ అయ్యారు. అయితే ఉప్పెన సినిమాలో కృతిశెట్టికి బదులు మరో భామ నటించాల్సిందట. ఒక స్టార్ హీరో కుమార్తె హీరోయిన్ గా డెబ్యూట్ ఇవ్వాల్సిందట. దర్శకుడు బుచ్చిబాబు ఆమెకు ఈ సినిమా కథని వినిపిస్తే.. ఆమె రిజెక్ట్ చేసిందట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు..? ఆ వారసురాలు ఎవరు..?
టాలీవుడ్ యాంగ్రీ మెన్ రాజశేఖర్ కుమార్తె 'శివానీ' ఉప్పెన సినిమాలో నటించాల్సి ఉందట. కానీ శివానీ నో చెప్పడంతో ఆ ఛాన్స్ కృతికి వెళ్ళింది. ఇంతకీ శివానీ ఉప్పెన చిత్రానికి ఎందుకు నో చెప్పింది..? బుచ్చిబాబు తనకి కథ చెప్పినప్పుడు సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయట. అందుకనే ఆమె నో చెప్పిందట. కానీ సినిమా రిలీజ్ అయ్యిన తరువాత చూస్తే.. అలాంటి సన్నివేశాలు అసలు కనిపించలేదని, కథలో చాలా మార్పులు కనిపించాయని శివానీ చెప్పుకొచ్చారు.
అలా బోల్డ్ సీన్స్ కారణంతో శివానీ ఆ సూపర్ హిట్ మూవీ ఛాన్స్ ని మిస్ అయ్యింది. ఆ తరువాత యువహీరో తేజ సజ్జా సరసన 'అద్భుతం' సినిమాలో నటించి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. గత ఏడాది తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాలు చేశారు. రీసెంట్ గా 'కోటబొమ్మాళి పీఎస్' సినిమాలో నటించిన ఆడియన్స్ ముందుకు వచ్చారు. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా పొలిటికల్ డ్రామాతో అందర్నీ ఆకట్టుకుంటుంది.
Next Story