Fri Dec 20 2024 12:22:43 GMT+0000 (Coordinated Universal Time)
2023 Rewind : ఈ ఏడాది టాలీవుడ్‌కి కలిసిరాని రీమేక్స్..
ఈ ఏడాది స్టార్ హీరోలంతా రీమేక్స్ తో డిజాస్టర్స్ అందుకున్నారు. ఇంతకీ ఆ చిత్రాలు ఏ సినిమాలకు రీమేక్‌లు..?
2023 Rewind : టాలీవుడ్ లో ఈ ఏడాది చిన్న సినిమాల హవానే కనిపించింది. పెద్ద హీరోలు రీమక్స్ అంటూ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రవితేజ.. ఈ స్టార్ హీరోలంతా రీమేక్స్ తో డిజాస్టర్స్ అందుకున్నారు. ఇంతకీ అవి ఏ సినిమాలు..? అవి ఏ చిత్రాలకు రీమేక్‌లు..?
భోళాశంకర్..
ఈ ఏడాదిని వాల్తేరు వీరయ్యతో గ్రాండ్ గా స్టార్ట్ చేసిన చిరంజీవి.. సంవత్సరం మధ్యలో మాత్రం 'భోళాశంకర్'తో ప్లాప్ ని ఎదుర్కొన్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. 2015లో తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ రీమేక్ అనౌన్స్ చేసినప్పుడే ఆడియన్స్ నుంచి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. కానీ మేకర్స్ అవేవి పట్టించుకోకుండా సినిమా తెరకెక్కించి.. ఓపెనింగ్స్ కూడా లేకుండా చేసుకున్నారు. చిరంజీవి కెరీర్ లోనే ఈ మూవీ ఒక పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
బ్రో..
ఇక అన్నయ్యకి జరిగినట్లే తమ్ముడికి కూడా జరిగింది. సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన సినిమా ‘బ్రో’. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని నటిస్తూ డైరెక్ట్ చేసిన కోలీవుడ్ మూవీ ‘వినోదాయ సిత్తం’. ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించింది. దీనిని బ్రోగా సముద్రఖనినే తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమా ఒరిజినల్ కథలో కొన్ని మార్పులు చేసి త్రివిక్రమ్.. ఈ కథని పవన్ కి అందించారు. ఈ రీమేక్ ని కూడా అభిమానులు మొదటిలోనే నిరాకరించారు. అయినాసరి మేకర్స్ తెరకెక్కించి ఫెయిల్ అయ్యారు.
రావణాసుర..
రవితేజ గ్రే షెడ్ పాత్రలో కనిపిస్తూ నటించిన సినిమా ‘రావణాసుర’. ఈ చిత్రం బెంగాలీ థ్రిల్లర్ మూవీ ‘విన్సీ డా’కి రీమేక్ గా వచ్చింది. అయితే ఆ సినిమాలోని మెయిన్ పాయింట్‌ని మాత్రమే తీసుకోని రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్లో సుధీర్ వర్మ తెరకెక్కించారు. ఇలా తెరకెక్కించడం వల్లే కథ, స్క్రీన్ ప్లే దెబ్బతిన్నట్లు అనిపిస్తుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ ని అందుకుంది.
రంగమార్తండ..
ఇక క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా గ్యాప్ తరువాత ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణలను ప్రధాన పాత్రల్లో చూపిస్తూ తెరకెక్కించిన ఎమోషనల్ డ్రామా మూవీ 'రంగమార్తండ'. ఈ చిత్రం మరాఠి సూపర్ హిట్ మూవీ ‘నట సామ్రాట్’కి రీమేక్ గా వచ్చింది. కథ, కథనం, దర్శకుడు మేకింగ్, యాక్టర్స్ నటన అంతా ఆకట్టుకున్నప్పటికీ.. కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదు.
బుట్ట బొమ్మ..
అర్జున్ దాస్, అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లవ్ అండ్ థ్రిల్లర్ మూవీ 'బుట్ట బొమ్మ'. 2020లో మలయాళ సూపర్ హిట్ అయిన 'కప్పెలా'కి ఇది రీమేక్ గా వచ్చింది. సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కలిసి ఈ సినిమాని నిర్మించడంతో రిలీజ్ కి ముందు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కానీ థియేటర్ లో మాత్రం ఆకట్టుకోలేక డిజాస్టర్ ని అందుకుంది.
Next Story