Mon Dec 23 2024 07:33:41 GMT+0000 (Coordinated Universal Time)
మహేష్ బాబుకి కోవిడ్ పాజిటివ్ !
ప్రజలతో పాటు.. సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి కరోనా నిర్థారణ అయింది. ఈ మేరకు
కరోనాతో దేశ ప్రజలు మళ్లీ పోరాటం చేయక తప్పట్లేదు. ప్రజలతో పాటు.. సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి కరోనా నిర్థారణ అయింది. ఈ మేరకు మహేష్ బాబు సోషల్ మీడియా లో ఓ పోస్ట్ చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా వదల్లేదని పేర్కొన్నారు. తనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లోనే ఉన్నట్లు మహేష్ ట్విట్టర్, ఇన్ స్టా వేదికగా వెల్లడించారు.
Also Read : కరోనా కల్లోలం.. 338 మంది వైద్యులకు పాజిటివ్ !
కొద్దిరోజులుగా తనను కలిసినవారు, తనతో సన్నిహితంగా ఉన్నవారు కూడా కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని మహేష్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, కోవిడ్ నుంచి త్వరలోనే కోలుకుని, మళ్లీ షూటింగ్ కు వెళ్లాలని ఎదురుచూస్తున్నానని తెలిపారు. కాగా.. మహేష్ కు కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ నుంచి మహేష్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Next Story