Fri Dec 20 2024 18:10:33 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : అయోధ్య రామ మందిర్ ఓపెనింగ్కి.. ఈ మూవీ స్టార్స్ అతిథులుగా..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎదురు చూస్తున్న అయోధ రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి ఈ మూవీ స్టార్స్ అతిథులుగా..
Ayodhya : రామజన్మ భూమి అయోధలో రామ్ మందిర్ ప్రారంభోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 2024 జనవరి 24న రామమందిర ప్రారంభోత్సవం జరగనుందని తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా ఈ ప్రారంభోత్సవం జరగబోతుందట. ఈ ఆలయ పూర్తి పనులు ఫిబ్రవరి లోపు పూర్తి చేసి భక్తుల సందర్శనార్థం కోసం తీసుకు రానున్నారట.
ఇక ఈ రామ మందిర్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు చాలా మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. ఈక్రమంలోనే ఇండియాలోని పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా ఆహ్వానాలు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకలో బాలీవుడ్ నుంచి ఐదుగురు స్టార్స్, తెలుగు, తమిళ్, కన్నడ నుంచి ఇద్దరు ఇద్దరు స్టార్స్, మలయాళం నుంచి ఒక స్టార్ అతిథిగా హాజరుకాబోతున్నారు. మరి ఆ స్టార్ ఎవరెవరో ఓ లుక్ వేసేయండి.
బాలీవుడ్ పరిశ్రమ నుంచి అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, టైగర్ ష్రాఫ్ అతిథులుగా వెళ్ళబోతున్నారు. ఇక టాలీవుడ్ నుంచి చిరంజీవి, ప్రభాస్ గెస్టులుగా హాజరుకాబోతున్నారు. తమిళ ఇండస్ట్రీ నుంచి మామాఅల్లుళ్లు రజినీకాంత్, ధనుష్ అతిథులుగా వెళ్ళబోతున్నారు. ఇక కన్నడ పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగిన యశ్, రిషబ్ శెట్టి గెస్టులుగా వెళ్లనున్నారు. మలయాళం నుంచి మోహన్ లాల్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారని సమాచారం.
ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ లిస్టులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక వివరాలు వచ్చే వరకు ఎదురు చూడాలి. అయితే ఇప్పుడు బయటకి వచ్చిన లిస్టు చూసిన సౌత్ ఆడియన్స్.. బాలీవుడ్ నుంచి ఐదుగురికి, మలయాళ ఇండస్ట్రీ నుంచి ఒక్కరికే ఆహ్వానం పంపడం అనేదానిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Next Story