Fri Dec 20 2024 12:31:18 GMT+0000 (Coordinated Universal Time)
2023 Rewind : ఈ ఏడాది టాలీవుడ్ టాప్ గ్రాసర్ చిత్రాలివే..
2023లో అదిరిపోయే కలెక్షన్స్ అందుకొని టాప్ 15 లిస్టులో నిలిచిన సినిమాలేంటో ఓ లుక్ వేసేయండి.
2023 Rewind : 2023లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్దకి చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రవితేజ, ప్రభాస్.. ఇలా స్టార్ హీరోలు తమ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. మరి వీటిలో అదిరిపోయే కలెక్షన్స్ అందుకొని టాప్ 15 లిస్టులో నిలిచిన సినిమాలేంటో ఓ లుక్ వేసేయండి.
#15 - సామజవరగమన..
శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన 'సామజవరగమన' కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్టుని అందుకుంది. శ్రీవిష్ణు కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రం.. 31 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది.
#14 - భోళాశంకర్..
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'భోళాశంకర్'.. తమిళ చిత్రం 'వేదాళం'కి రీమేక్ గా వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ.. 40 కోట్ల గ్రాస్ ని అందుకుంది. అయితే సినిమా ప్రాఫిట్ లెక్కలు ప్రకారం మాత్రం.. నష్టమే కలిగింది.
#13 - టైగర్ నాగేశ్వరరావు..
స్టూవర్ట్పురం గజదొంగ 'టైగర్ నాగేశ్వరరావు' లైఫ్ స్టోరీ ఆధారంగా రవితేజ హీరోగా తెరకెక్కిన 'టైగర్ నాగేశ్వరరావు' పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద.. 44 కోట్లు పైనే గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది.
#12 - స్కంద..
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన 'స్కంద'.. ఊర మాస్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి కలెక్షన్సే అందుకుంది. ఓవర్ ఆల్ గా ఈ చిత్రం 49 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
#11 - మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి..
అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి హీరోహీరోయిన్లుగా న్యూ ఏజ్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం మంచి విజయానే అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద 56 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని నవీన్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది.
#10 - హాయ్ నాన్న..
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా ఆడియన్స్ ముందుకు వచ్చిన 'హాయ్ నాన్న' ఆడియన్స్ మనసు దోచుకొని మంచి విజయానే అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 58 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసింది.
#9 - ఖుషి..
విజయ్ దేవరకొండ, సమంత కంబినేషనల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన 'ఖుషి' సూపర్ హిట్టుని అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 75 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.
#8 - విరూపాక్ష..
చేతబడులు కథాంశంతో మిస్టిక్ థ్రిల్లర్ గా వచ్చిన సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సంయుక్త మీనన్ హీరోయిన్ నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 82 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది.
#7 - బేబీ..
ఏ అంచనాలు లేకుండా చాలా సినిమాగా వచ్చిన 'బేబీ' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచనలం సృష్టించింది. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ నటించిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద 83 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది.
#6 - బ్రో..
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో'.. తమిళ చిత్రం 'వినోదయ సిత్తం'కి రీమేక్ గా వచ్చింది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 98 కోట్ల కలెక్షన్స్ ని నమోదు చేసింది.
#5 - భగవంత్ కేసరి..
బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'భగవంత్ కేసరి' సూపర్ హిట్ అందుకొని బాలయ్యకి హ్యాట్రిక్ ఇచ్చింది. అఖండ, వీరసింహారెడ్డి తరువాత ఈ చిత్రం కూడా వరుసగా 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 110 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది.
#4 - దసరా..
మాస్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపిస్తూ నాని నటించిన చిత్రం 'దసరా'. కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద 115 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి నాని 100 కోట్ల క్లబ్ లోకి తీసుకొచ్చింది.
#3 - వీరసింహారెడ్డి..
బాలయ్య వింటేజ్ లుక్ లో కనిపిస్తూ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లో చేసిన సినిమా 'వీరసింహారెడ్డి'. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 120 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది.
#2 - వాల్తేరు వీరయ్య..
చిరంజీవిలోని వింటేజ్ కామెడీని పరిచయం చేస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. రవితేజ ఒక ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్ గా 210 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
#1 - సలార్..
బాహుబలి తరువాత సరైన హిట్టు లేని ప్రభాస్ కి 'సలార్'తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ దొరికింది. ఈ చిత్రం రిలీజైన మూడు రోజుల్లోనే 400 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసి టాలీవుడ్ టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఓవర్ ఆల్ గా ఈ చిత్రం పాన్ ఇండియా టాప్ గ్రాసర్ గా కూడా నిలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆదిపురుష్ కూడా ఈ ఏడాదే రిలీజ్ అయ్యింది కదా. అది ఈ లిస్టులో లేదేంటి అంటారేమో. అది పూర్తి బాలీవుడ్ సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది.
Note : ఇవి కేవలం గ్రాసర్ ప్రకారం తీసిన లిస్ట్ మాత్రమే. లాభనష్టాలు ప్రకారం చూస్తే.. ఈ లిస్టు మారుతుంది.
Next Story