Sun Jan 12 2025 15:40:28 GMT+0000 (Coordinated Universal Time)
రెమ్యునరేషన్ తగ్గించుకుంటాం.. అగ్రహీరోలు
టాలీవుడ్ షూటింగ్ లు బంద్ పై అగ్రహీరోలు చర్చలు జరిపారు. రామ్చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో దిల్ రాజు చర్చలు జరిపారు
టాలీవుడ్ షూటింగ్ లు బంద్ పై అగ్రహీరోలు చర్చలు జరుపుతున్నారు. రామ్చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో నిర్మాత దిల్ రాజు చర్చలు జరిపారు. తమ రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు అగ్రహీరోలు ముందుకు వచ్చారు. మరోవైపు షూటింగ్ ల సంక్షోభం చిరంజీవి లేఖ రాశారు. ఈరోజు మధ్యాహ్నం మరోసారి కౌన్సిల్ సమావేశం కానుంది.
షూటింగ్ ల బంద్ పై....
ఈ సమావేశంలో షూటింగ్ ల బంద్ పై నిర్ణయం తీసుకోనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్ ల బంద్ నిలిపివేయాలని నిర్మాత మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఓటీటీ లో వెంటనే సినిమాలు విడుదల చేయడం, ఖర్చు విపరీతంగా పెరిగిపోవడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తుందని నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అందరూ చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి లేఖ కూడా రాశారు. అందరి అభిప్రాయాలను తీసుకుని షూటింగ్ ల నిలుపుదలపై నేడు జరిగే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story