Mon Dec 23 2024 20:27:08 GMT+0000 (Coordinated Universal Time)
డైరెక్టర్ త్రివిక్రమ్ కారును అడ్డుకున్న పోలీసులు !
పోలీసుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. కార్లకు బ్లాక్ ఫిల్మ్, వాహనాలపై వీఐపీ, పోలీస్, ప్రెస్ సంబంధిత స్టిక్కర్లను తొలగించి,
జూబ్లిహిల్స్ : హైదరాబాద్ లో బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. కార్లకు బ్లాక్ ఫిల్మ్, వాహనాలపై వీఐపీ, పోలీస్, ప్రెస్ సంబంధిత స్టిక్కర్లను తొలగించి, జరిమానా విధిస్తున్నారు. ఇప్పటి వరకూ సినీ పరిశ్రమకు చెందిన పలువురి వాహనాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, కల్యాణ్ రామ్ ల కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించారు. తాజాగా ఆ లిస్ట్ లోకి టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ కూడా చేరిపోయారు. జూబ్లిహిల్స్ మీదుగా వెళ్తున్న సమయంలో త్రివిక్రమ్ కారును పోలీసులు ఆపారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో.. దానిని తొలగించి జరిమానా విధించారు.
Next Story