Mon Dec 23 2024 15:00:56 GMT+0000 (Coordinated Universal Time)
సినిమా చెట్టు ఇక లేదు.. కూలిపోయిన 150 ఏళ్ల నాటి వృక్షం
ఎన్నో సినిమాలకు ఆ చెట్టు ఒక అడ్రస్ గా మారింది. అయితే ఆ చెట్టు నిన్న తెల్లవారు జామును నేలకూలింది.
సినిమా షూటింగ్ లు ఆ చెట్టు కింద ఎన్నో జరపుకున్నాయి. దాదాపు మూడు వందలకు పైగా సినిమాలు ఆ చెెట్టునీడన షూటింగ్ చేశాయి. ఎన్నో సినిమాలకు ఆ చెట్టు ఒక అడ్రస్ గా మారింది. అయితే ఆ చెట్టు నిన్న తెల్లవారు జామును నేలకూలింది. 150 ఏళ్ల నాటి ఈ చెట్టు కూలిపోవడంతో ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా డైరెక్టర్ వంశీ తీసిన ప్రతి సినిమాలో ఈ చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. సీతారామయ్య గారి మనవరాలు, శంకరాభరణం, త్రిశూలం వంటి చిత్రాల్లో ఈ చెట్టు కనిపించింది.
ఎన్నో షూటింగ్ లు...
ఈ చెట్టు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద గోదావరి నది ఒడ్డున ఉండటంతో అనేక మంది దర్శకులు ఈ చెట్టు నీడన ఎన్నో షూటింగ్ లు చేశారు. ఏఎన్నార్, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి అగ్రహీరోల సినిమాలను కూడా ఇక్కడ చిత్రీకరించారు. అయితే ఈ చెట్టును రక్షించడంలో పాలకులు విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గట్టు నానిపోయి చెట్టు పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
Next Story