ఈసారి సీరియస్ గానే చెబుతున్నాడు..!
తాను సినిమా తీస్తున్నప్పుడు.. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా తన సినిమా సెట్స్ లో ఫోన్ కానీ, లాప్ టాప్స్ కి కానీ అనుమతి ఉండదు. యనెవరో ఇప్పటికే గ్రహించి ఉటారు. ఆయనే దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. రాజమౌళి సినిమాని తన కుటుంబంలోని వాళ్లతోనే వివిధ విభాగాలకు పని చేయించుకుంటూ... సినిమా యూనిట్ ని మొత్తం కంట్రోల్ లో ఉంచుకుంటాడు. అలాగే తన సినిమా సెట్స్ లోకి ఫోన్స్ అస్సలు అనుమతి ఉండదు. అందుకే ఎంత పెద్ద సినిమా అయినా ఆయన సినిమాలోని సీన్స్ గానీ, పిక్స్ గానీ చాలా రేర్ గా బయటికి వస్తాయి. మూవీ యూనిట్ మొత్తం రాజమౌళి కంట్రోల్ లోనే ఉంటుంది.
త్రివిక్రమ్ మంచితనమే కారణమా..?
కానీ కొంతమంది దర్శకుల విషయంలో అంత పర్ఫెక్షన్ ఉండదు. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకడు. ఆయన సినిమాల సెట్స్ నుండి సీన్స్ అయినా, పిక్స్ అయినా ఇట్టే లీక్ అవుతుంటాయి. మరి ఆయన మంచితనమో.. యూనిట్ సభ్యుల క్యూరియాసిటీ నో తెలియదు గాని త్రివిక్రమ్ సినిమాలకు లీకులనేవి కామన్ అనేలా ఉంది వ్యవహారం. అత్తారింటికి దారేది సినిమా అయితే ఏకంగా సగం సినిమాని లీకు రాయుళ్లు యూట్యూబ్ లో లీక్ చేసేసారు. సినిమా హిట్ అవ్వబట్టి గానీ లేదంటే అత్తారింటికి నిర్మాత నిండా మునిగేవాడు. ఇక తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యి... ఎన్టీఆర్ సాడ్ మూమెంట్ లో ఉన్న పిక్ ఒకటి నెట్టింట్లో హల్చల్ చేసింది. ఇక నాగబాబు, ఎన్టీఆర్ ఉన్న ఆ పిక్ కాస్తా క్షణాల్లో వైరల్ అయ్యింది.
సీరియస్ అయిన త్రివిక్రమ్
అయితే ఈ లీకు ఎవరు చేశారో అని ఆరా తీస్తూనే త్రివిక్రమ్ ఇప్పుడు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడట. యూనిట్ సభ్యుల నుండే ఈ లీకు జరిగిందని గ్రహించిన త్రివిక్రమ్... సీరియస్ అవడమే కాదు.. ఇప్పుడు ఈ సినిమాకి చిత్ర బృందం మొత్తం ఎవరూ కూడా సెట్ లోకి సెల్ ఫోన్స్ తేవొద్దని స్ట్రిక్ట్ గా రూల్స్ పాస్ చేసాడట. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా ఫోన్ చేసుకోవాలనుకుంటే, సెట్ బయటికి వెళ్లి అక్కడ మాత్రమే మాట్లాడాలని చిత్ర బృందానికి ఆదేశాలు ఇచ్చాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. మరి అంత సీరియస్ గా లేకపోతె గతంలోలానే... ఈ సినిమా నుండి అనేకనేకం లీక్ అయ్యే ప్రమాదం ఉంది. మరి త్రివిక్రమ్ అంత కఠిన నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఇలాంటి లీక్డ్ పిక్స్ వలన పెద్ద ప్రాజెక్టులకు భారీ డ్యామేజ్ జరిగే ప్రమాదం చాలా వుంది.