Mon Dec 23 2024 20:18:35 GMT+0000 (Coordinated Universal Time)
త్రివిక్రమ్ కొడుకుని చూశారా.. అతను కూడా దర్శకుడిగా..!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వారసుడు కూడా దర్శకుడిగా తెలుగు ఆడియన్స్ ని అలరించడానికి సిద్దమవుతున్నాడట.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రచయితగా డైలాగ్స్తో, దర్శకుడిగా తన టేకింగ్తో క్లాస్-మాస్ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నాడు. రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి పలు సీరియల్స్, సినిమాలకి రచయితగా పని చేసి, ఆ తరువాత 'నువ్వే నువ్వే' సినిమాతో దర్శకుడిగా కెరీర్ ని మొదలుపెట్టాడు. అక్కడి మొదలైన దర్శకత్వం.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ని డైరెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్టులు నమోదు చేసే స్థాయికి ఎదిగాడు.
ఇప్పుడు ఆయన వారసుడు కూడా దర్శకుడిగా తెలుగు ఆడియన్స్ ని అలరించడానికి సిద్దమవుతున్నాడట. టాలీవుడ్ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి బంధువుల అమ్మాయి అయిన 'సాయి సౌజన్య'ని పెళ్లి చేసుకున్న త్రివిక్రమ్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వీరు పెద్దగా మీడియా ముందు కనిపించరు. గతంలో కొడుకు ఫోటో ఒకటి బయటకి వచ్చి బాగా వైరల్ అయ్యింది. త్రివిక్రమ్ కొడుకు పేరు 'రిషి మనోజ్'.
తాజాగా సిరివెన్నెల తనయుడు యాక్టర్ రాజా.. త్రివిక్రమ్ కొడుకుతో ఉన్న ఫోటో షేర్ చేశాడు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో రాజా.. త్రివిక్రమ్ భార్య సౌజన్య, రిషి మనోజ్ తో కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో రిషి మనోజ్ గురించి చర్చ మొదలైంది. ఈక్రమంలోనే రిషి కూడా త్వరలో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం త్రివిక్రమ్ సతీమణి సౌజన్య నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఫార్ట్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ ప్రారంభించి సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి డీజే టిల్లు, సార్, మ్యాడ్ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. ఇక తమ తనయుడు రిషి మనోజ్ ని దర్శకుడిగా ఆ బ్యానర్ లోనే పరిచయం చేసే అవకాశం ఉంది.
Next Story