Mon Dec 23 2024 23:03:41 GMT+0000 (Coordinated Universal Time)
షణ్ముఖ్ కు ఆ స్థానం కూడా ఇవ్వకూడదట
బిగ్ బాస్ సీజన్ 5లో రన్నర్ అప్ గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్ పై ట్రోల్స్ కొనసాగుతున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 5లో రన్నర్ అప్ గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్ పై ట్రోల్స్ కొనసాగుతున్నాయి. షణ్ముఖ్ ను రన్నర్ అప్ గా ఎందుకు చేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు నిలదీస్తున్నారు. సన్నీ ఫైనల్ గా విజేత అని అందరూ ఊహించుకున్నారు. కానీ శ్రీరామ చంద్ర రన్నర్ అప్ గా నిలుస్తారని భావించారు. అలాంటిది శ్రీరామచంద్ర మూడో సారి ఎలిమినేట్ అవ్వడాన్ని అందరూ తప్పుపడుతున్నారు.
శ్రీరామచంద్రకు....
శ్రీరామ చంద్రకు ఉన్న ఫేమ్ కు అసలు విజేతగా నిలవాలని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ముందుగానే ఫిక్స్ అయిన గేమ్ అంటూ నెటిజన్లు బిగ్ బాస్ నిర్వాహకులపై ఫైర్ అవుతున్నారు. సిరి, షణ్ముఖ్ లు హౌస్ లో సీన్ క్రియేట్ చేయడం తప్ప పెద్దగా గేమ్ ఆడింది లేదని, మోజ్ రూమ్ కే పరిమితమయిన వారిని కావాలనే ఫైనల్స్ వరకూ రప్పించారన్న విమర్శలు చేస్తున్నారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా రన్నర్ అప్ ఎంపిక జరిగిందన్న కామెంట్స్ జోరుగా వినపడుతున్నాయి.
Next Story