Mon Dec 23 2024 07:08:45 GMT+0000 (Coordinated Universal Time)
సెకండ్ హ్యాండ్ ఐటెమ్ అంటూ సమంతపై ట్రోల్స్..
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత ఒక స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట
చై-సామ్ విడాకుల ప్రకటన తర్వాత సమంత కనిపించిన మొదటి సినిమా పుష్ప - ది రైజ్. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత ఒక స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట యూట్యూబ్ లో రికార్డు సృష్టిస్తోంది. అయితే.. ఆ రికార్డు గురించి వివరిస్తూ.. ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ను మరో నెటిజన్ రీ ట్వీట్ చేస్తూ.. " సమంత సెకండ్ హ్యాండ్ ఐటమ్ జెంటిల్‌మ్యాన్ నుంచి రూ.50 కోట్లు తీసుకుంది" అని రాసి ట్రోల్ చేశాడు. ఈ ట్వీట్ పై సమంత తనదైన శైలిలో స్పందించింది.
తనను సెకండ్ హ్యాండ్ ఐటెమ్ అంటూ ట్రోల్ చేసిన నెటిజన్ కు రిప్లై ఇచ్చింది. భగవంతుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అంటూ సమంత అతనికి తెలిపింది. దాంతో ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సమంతకు మద్దతుగా నిలిచారు. నువ్వు ఎందుకూ పనికిరాని ఫస్ట్ హ్యాండ్ ఐటమ్ అంటూ నటుడు బ్రహ్మాజీ సదరు నెటిజన్‌కు రిప్లై ఇచ్చారు. అది చూసిన సదరు నెటిజన్ వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేసేశాడు.
Next Story