Mon Dec 23 2024 12:15:51 GMT+0000 (Coordinated Universal Time)
మరో స్టార్ కపుల్ విడాకులు ?
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కపుల్ విడిపోతున్నారంటూ నెట్టింట ఓ ట్వీట్ వైరల్ అవుతుంది. అతనెవరో కాదు ప్రస్తుతం వరుస..
ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి చెందిన స్టార్ కపుల్స్ విడిపోవడం పరిపాటిగా మారింది. ఇతర స్టార్ కపుల్స్ కూడా విభేదాలు రావడంతో విడిపోతున్నారు. సమంత - నాగచైతన్య విడాకుల ప్రకటన అందరికీ షాకిచ్చింది. ఆ తర్వాత రజనీకాంత్ కూతురు ఐశ్వర్య-హీరో ధనుష్ కూడా విడిపోతున్నామని ప్రకటించారు. కానీ.. పిల్లల కోసం మళ్లీ కలిశారు. దాంతో ధనుష్ ఫ్యాన్స్ హ్యాపీ. మెగా వారింట శ్రీజ, నిహారిక ల విడాకుల వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇటీవల నిహారిక ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొనపుడు కూడా విడాకుల వార్తలపై స్పందించకుండా మాట దాటేసింది. దాంతో విడాకులు నిజమేనంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇక బాలీవుడ్ లో కపుల్స్ సంగతి చెప్పనక్కర్లేదు. పెళ్లికి ముందు డేటింగ్.. అంతా ఓకే అయితే పెళ్లి.. లేదంటే బ్రేకప్.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కపుల్ విడిపోతున్నారంటూ నెట్టింట ఓ ట్వీట్ వైరల్ అవుతుంది. అతనెవరో కాదు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న వరుణ్ ధావన్. రెండేళ్ల క్రితం తన స్నేహితురాలైన నటాషాను పెళ్లిచేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఈ జంట చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడీ జంట విడాకులు తీసుకుంటున్నారంటూ ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. సెలబ్రిటీల గురించి సెన్సేషనల్ కామెంట్స్తో ఎప్పుడు వార్తల్లో నిలిచే ఉమైర్ సంధు.. వరుణ్ ధావన్ కపుల్ పై ట్వీట్ చేయడంతో అది నెట్టింట వైరల్ అవుతోంది. వరుణ్ ధావన్, నటాషా ఇద్దరిమధ్య చెడింది. వీరి మధ్య విభేదాలు తలెత్తుతుండటంతో విడాకులు తీసుకునేందుకు డిసైడ్ అయ్యారు అని ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ పై వరుణ్ కపుల్ స్పందిస్తారో లేదో చూడాలి.
Next Story