Mon Dec 23 2024 12:06:34 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో పెరిగిన సినిమా టికెట్ల రేట్లు.. వివరాలిలా
రాష్ట్రవ్యాప్తంగా సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు టీఎస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. టికెట్ రేట్స్ ఎక్కడ ఎంత పెంచాలి? ఏ థియేటర్లో ఎంత ఉండాలి? నగరాల్లో ఎంత? పట్టణాల్లో ఎంత?
ఓ వైపు ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గింపుపై పెద్ద రచ్చ జరుగుతుంటే.. తెలంగాణ సర్కార్ మాత్రం సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాల టికెట్ల రేట్లను పెంచడంపై ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ చేయగా.. దానిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు టీఎస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. టికెట్ రేట్స్ ఎక్కడ ఎంత పెంచాలి? ఏ థియేటర్లో ఎంత ఉండాలి? నగరాల్లో ఎంత? పట్టణాల్లో ఎంత? అన్న వివరాలను పొందుపరుస్తూ.. డిటైల్డ్ ప్రపోజల్స్ ను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
ఇకపై తెలంగాణలోని నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ కనీస ధర రూ. 30గా.. గరిష్ఠ ధర రూ. 70గా ఫిక్స్ చేశారు. అలాగే ఏసీ థియేటర్లలో కనీస టికెట్ ధర రూ.50 గా, గరిష్ట ధర రూ.150గా నిర్ణయించింది. మల్టీప్లెక్స్ లలో కనీస ధర రూ.100, గరిష్ట ధర రూ.250కి పెంచింది. స్పెషల్ రిక్లైనర్ సీట్ల ధర రూ.300గా ఫిక్స్ చేశారు. వీటికి జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలు అదనం. నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్లు రూ. 5, నాన్ ఏసీ థియేటర్లు రూ. 3 వసూలు చేసుకోవచ్చు. ఆన్ లైన్ టికెటింగ్ సంస్థలు సినిమా టికెట్ల ధరలపై అదనంగా జీఎస్టీ వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Next Story