Mon Dec 23 2024 08:38:39 GMT+0000 (Coordinated Universal Time)
మహేష్ - విజయ్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్
మహేష్ బాబు నటించిన సర్కారువారిపాట సినిమా నుంచి కళావతి అనే మొదటిసాంగ్ ఈనెల 14వ తేదీన విడుదల కానుంది. అదే రోజు విజయ్ నటించిన
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి దక్షిణాదిలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు. అంతేకాదు.. మహేష్ బాబు తెలుగులో చేసిన పలు సినిమాలను తమిళ్ లో రీమేక్ చేసి హిట్స్ కొట్టాడు విజయ్. వీరిద్దరి మధ్య కూడా మంచి స్నేహం ఉంది. కానీ ఇరువురి హీరోల అభిమానుల్లో మాత్రం సయోధ్య ఉన్నట్లుగా లేదు. మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటూ ట్విట్టర్ వేదికగా వార్ మొదలుపెట్టారు. ఇద్దరు హీరోలకు చెందిన అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ జరగడం ఇదే మొదటిసారి కాదు గానీ.. ఇప్పుడు మహేష్ - విజయ్ అభిమానుల వంతైంది. ఇంతకీ ఎందుకీ వార్ ?
మహేష్ బాబు నటించిన సర్కారువారిపాట సినిమా నుంచి కళావతి అనే మొదటిసాంగ్ ఈనెల 14వ తేదీన విడుదల కానుంది. అదే రోజు విజయ్ నటించిన బీస్ట్ నుంచి సింగిల్ కూడా రాబోతోంది. తమ అభిమాన హీరోల నుంచి వచ్చే పాటలను ఆనందంగా ఆస్వాదించాల్సింది పోయి.. ట్విట్టర్ లో వార్ మొదలుపెట్టారు. యూట్యూబ్‌లో 'బీస్ట్' ట్రాక్ లైక్స్ ను పెంచడానికి విజయ్ అభిమానులు బాట్స్ ను ఉపయోగిస్తారని మహేష్ ఫ్యాన్స్ ఆరోపించగా.. దాంతో విజయ్ ఫ్యాన్స్ మహేష్ అభిమానులు ఫౌల్ క్రై చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలు కాస్తా పెద్దవై.. ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ట్వీట్ వార్ తీవ్రరూపం దాల్చి ఆ పై నెగిటివ్ ట్రెండ్స్‌తో దాడి మొదలెట్టారు. ఈ రెండు సినిమాల పాటలు విడుదల కావటానికి చాలా టైమ్ ఉన్నా వీరి ఫ్యాన్ వార్ మాత్రం తారాస్థాయికి చేరింది.
News Summary - Twitter War between Mahesh and vijay Fans
Next Story