Mon Dec 23 2024 07:38:20 GMT+0000 (Coordinated Universal Time)
దర్శకుల మధ్య ట్విట్టర్ వార్
తాజాగా బీవీఎస్ రవి, హరీష్ శంకర్ ల మధ్య ఆసక్తికర ట్విట్టర్ వార్ జరిగింది. ఈ సోషల్ మీడియా వార్ చూస్తుంటే వారి మధ్య కొన్ని
సెలబ్రిటీల మధ్య ట్విట్టర్ వార్ అంటే.. ఎంత ఆసక్తిగా ఉంటుందో కదా నెటిజన్లకు. అది టాలీవుడ్ ప్రముఖుల మధ్యే అయితే.. అందులోనూ ఇద్దరు దర్శకుల మధ్య అయితే.. ఎంత హాట్ టాపిక్ అవుతుందో కదా. సరిగ్గా ఇదే జరిగింది. ఐక్యంగా ఉండే దర్శకుల మధ్య ఓ ట్వీట్ చిచ్చురేపిందు. సోషల్ మీడియా వేదికగానే ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అనుభవించమని ఒకరంటే.. పిరికితనం అంటూ మరొకరు విరుచుకుపడుతున్నారు.
తాజాగా బీవీఎస్ రవి, హరీష్ శంకర్ ల మధ్య ఆసక్తికర ట్విట్టర్ వార్ జరిగింది. ఈ సోషల్ మీడియా వార్ చూస్తుంటే వారి మధ్య కొన్ని విభేదాలున్నాయని అర్థమవుతోంది. గత రాత్రి బీవీఎస్ రవి ఒక ట్వీట్ చేయగా.. అది ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి చేసినట్లుగా ఉంది. "అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయo చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది" అని ట్వీట్ చేయగా.. దానిపై హరీష్ శంకర్ స్పందించారు. "అనుభవించమని ఇచ్చారా ??" అని ప్రశ్నించారు. అలా వారిద్దరి మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. ఈ వార్ పై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు.
Next Story