వార్ అండ్ సైరా చిత్రాల కలెక్షన్స్ అక్కడ డల్ అయ్యాయి
అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు రెండు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా మరొకటి హృతిక్ రోషన్, టైగర్ [more]
అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు రెండు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా మరొకటి హృతిక్ రోషన్, టైగర్ [more]
అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు రెండు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా మరొకటి హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ల మల్టీస్టారర్ వార్. ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ తో దుమ్ములేపుతున్నాయి. ఈ రెండు చిత్రాలు ఇండియా లో పలు భాషల్లో రిలీజ్ అయ్యాయి. చిరు సైరా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయింది. సౌత్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ హిందీ లో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. కారణాలు ఏమైనా హిందీ లో మాత్రం చాలా తక్కువ ఓటింగ్స్ వచ్చాయి.
సౌత్ లో దెబ్బతీసిందా….?
ఇక వార్ చిత్రం కూడా హిందీ తో పాటు తెలుగు, తమిళంలో కూడా రిలీజ్ అయింది. కానీ ఈ రెండు భాషల్లో ఈ సినిమా పరిస్థితి కూడా చాలా డల్ గా ఉండటం విశేషం. మొదటి రోజు వార్ చిత్రం రూ. 52 కోట్ల కలెక్షన్స్ తో ఆల్ టైం హైయెస్ట్ ఫస్ట్ డే గ్రాస్సర్ లో ఒకటిగా నిలవగా నాలుగు రోజుల్లో రూ. 123.60 కోట్ల కలెక్షన్స్ తో దుమ్ముదులిపింది కానీ సౌత్ లో మాత్రం వసూళ్లు చాలా తక్కువగా ఉండటం గమనార్హం. ఈ సినిమా సౌత్ లో నాలుగు రోజులు గాను కేవలం రూ.5.25 కోట్ల వసూళ్లు రాబట్టగలిగింది.