Mon Dec 23 2024 12:39:28 GMT+0000 (Coordinated Universal Time)
Uday Kiran : ఉదయ్ కిరణ్‌ని చిరంజీవే.. వైరల్ కామెంట్స్ చేసిన ఉదయ్ కిరణ్ సోదరి..
ఉదయ్ కిరణ్ మరణానికి కారణం చిరంజీవే అంటూ చాలామంది విమర్శలు చేస్తూ వస్తుంటారు. తాజాగా ఈ విషయం పై ఉదయ్ కిరణ్ సోదరి..
Uday Kiran : టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ మరణం.. ఇప్పటికి టాలీవుడ్ లో ఓ హాట్ టాపిక్కే. ఆయన ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి అనేవి ఎవరికి సరిగ్గా తెలియదు. కానీ ఉదయ్ సూసైడ్ కి బలమైన కారణం.. మెగాస్టార్ చిరంజీవే అంటూ పలువురు విమర్శలు చేస్తూ వస్తుంటారు. చిరంజీవి తన కూతురికి ఉదయ్ కిరణ్ ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. నిశ్చితార్థం వేడుక కూడా జరిపారు.
కానీ కొన్ని కారణాలు వల్ల ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఆ తరువాత ఉదయ్ వేరే అమ్మాయిని చేసుకున్నారు. కానీ ఆమెతో కూడా విబేధాలు వచ్చాయి. ఆ సమయంలోనే సినిమా ప్లాప్స్ కూడా ఎదురవ్వడంతో ఛాన్స్ లు తగ్గాయి. అయితే బయట వారంతా.. దీనంతటికీ చిరంజీవే కారణమని, సినిమా ఛాన్స్ లు కూడా రాకుండా ఆయనే చేస్తున్నారని పలువురు కామెంట్స్ చేసారు. ఇప్పటికి చేస్తూనే వస్తున్నారు.
కాగా ఈ విషయం పై ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి చాలాసార్లు మాట్లాడారు. ఇప్పుడు మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఉదయ్ కిరణ్ నటించిన 'నువ్వు నేను' మూవీ రీ రిలీజ్ అవ్వడంతో.. శ్రీదేవి పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉదయ్ కిరణ్ గురించిన పలు విషయాలను ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి విషయం గురించి కూడా ఆమె మాట్లాడారు.
చిన్నతనం నుంచి ఉదయ్ కిరణ్ కి చిరంజీవి అంటే చాలా ఇష్టమంట. చిన్నప్పుడు ఓ ఫంక్షన్ లో చిరంజీవిని కలుసుకున్నప్పుడు ఉదయ్ కిరణ్ చాలా సంబరపడిపోయాడట. ఇక సినిమాల్లోకి వచ్చిన తరువాత ఉదయ్ కిరణ్ ని చిరంజీవే చాలా సపోర్ట్ చేశారట. ఉదయ్ తన సినిమాల విషయంలో చిరంజీవితో మాట్లాడి సలహాలు కూడా తీసుకునేవారట. మొత్తానికి ఉదయ్ కిరణ్ కి చిరంజీవి ఓ గాడ్ ఫాదర్ లా ఉండేవారని ఆమె చెప్పుకొచ్చారు.
Next Story