Thu Dec 19 2024 15:38:11 GMT+0000 (Coordinated Universal Time)
చిరంజీవి, నాగార్జునతో కేంద్ర మంత్రి భేటీ
హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు
హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. చిరంజీవితో పాటు మరో హీరో నాగార్జునను కూడా ఆయన కలిశారు. సినీ పరిశ్రమ పురోగతిపై ముగ్గురూ చర్చించుకున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో షేర్ చేశారు. తన ఇంటికి వచ్చిన కేంద్ర మంత్రి అనుగార్ ఠాకూర్ ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు.
ఆనందంగా ఉందంటూ...
అయితే ఈ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేస్తూ హైదరాబాద్ వచ్చిన మీరు మా ఇంటికి రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భారతీయ సినీ పరిశ్రమ గురించి, అది సాధిస్తున్న పురోగతి గురించి నా సోదరుడు నాగార్జునతో కలసి మీతో చర్చించడం ఆనందంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు.
Next Story