Sun Dec 22 2024 22:38:11 GMT+0000 (Coordinated Universal Time)
Unstoppable 2 : పెదనాన్నని తలచుకుని ఏడ్చేసిన ప్రభాస్
కృష్ణంరాజు ప్రభాస్ ని పొగిడిన వీడియోలను చూపించారు బాలయ్య. అవి చూసి ప్రభాస్ ఎమోషనల్ అయ్యారు. అనంతరం కృష్ణంరాజుకి..
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా.. ఆహా ఓటీటీలో వస్తోన్న Unstoppable 2 గ్రాండ్ సక్సెస్ తో ముందుకి దూసుకెళ్తోంది. రెండో సీజన్లో ఏడు ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న Unstoppable 2.. తాజాగా 8వ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వచ్చింది. 7వ ఎపిసోడ్ లో ప్రభాస్ గెస్ట్ గా రాగా.. ఆ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక చెప్పిన టైమ్ కి 8వ ఎపిసోడ్ ని స్ట్రీమ్ చేసింది ఆహా. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, హీరో గోపీచంద్ ని తీసుకొచ్చారు.
ఈ ఎపిసోడ్ కు కూడా రీచ్ ఎక్కువగానే వస్తోంది. ఎనిమిదో ఎపిసోడ్ లో బాలయ్యతో కలిసి ప్రభాస్, గోపీచంద్ రచ్చ రచ్చ చేశారు. ఎపిసోడ్ ఆద్యంతం నవ్వించారు, అలరించారు, ఎన్నో గుర్తుండిపోయే మూమెంట్స్ ని ప్రేక్షకులకి అందించారు. గోపీచంద్ రాకతో.. మళ్లీ ప్రభాస్ పెళ్లి టాపిక్ వచ్చింది. ఈ విషయమై కాసేపు బాలయ్య, గోపీచంద్ ప్రభాస్ తో ఆడుకున్నారు. గోపీచంద్ సినీ కెరియర్ కు సంబంధించిన విషయాల గురించి ముచ్చటించారు.
ఇటీవల ప్రభాస్ పెదనాన్న, సీనియర్ నటుడు కృష్ణంరాజు కాలంచేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో ఆయన ప్రస్తావన కూడా రాగా.. కృష్ణంరాజు ప్రభాస్ ని పొగిడిన వీడియోలను చూపించారు బాలయ్య. అవి చూసి ప్రభాస్ ఎమోషనల్ అయ్యారు. అనంతరం కృష్ణంరాజుకి నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. కృష్ణంరాజు, ప్రభాస్ ని కలిపి వారి సినిమాల్లోంచి ఒకేలా ఉన్న విజువల్స్ ని తీసి అభిమానులు ఓ వీడియో చేయగా దాన్ని ప్లే చేశారు. ప్రభాస్ తన పెదనాన్న గురించి మాట్లాడుతూ.. మొగల్తూరు నుంచి ఇక్కడికి వచ్చి, ఇంట్లో వద్దన్నా సినిమాలు చేసి, మొదట చాలా సినిమాలు ఫెయిల్ అయినా ఇక్కడే నిలబడి, కష్టపడి సక్సెస్ అయ్యారని చెప్పుకొచ్చారు. పెదనాన్న వల్లే తమ కుటుంబమంతా ఈ రోజు ఈస్థాయిలో ఉందని, ఆయన లేకపోతే తాము లేమన్నారు.
Next Story