Mon Dec 15 2025 06:32:24 GMT+0000 (Coordinated Universal Time)
Unstoppable 2 New Promo : రెండు తరాల హీరోయిన్లతో..నారి నారి నడుమ మురారి
ఈ ముగ్గురితో కలసి బాలయ్య చేసిన అల్లరిని.. ఆమె స్మైల్ కి పడిపోయాను అంటూ సరదాగా..

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా.. ఆహా ఓటీటీలో సూపర్ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది అన్ స్టాపబుల్ 2. ఇటీవల ప్రభాస్, గోపీచంద్ ల ఎపిసోడ్ కు సంబంధించిన గ్లింప్స్, ప్రోమోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 30న స్ట్రీమింగ్ చేయనున్నారు. అంతకన్నా ముందు.. అలనాటి, ఇలనాటి హీరోయిన్లతో బాలయ్య సందడి చేసిన ఎపిసోడ్ ఈ నెల 23న స్ట్రీమ్ అవనుంది. తాజాగా ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసింది ఆహా.
ఈ ఆరవ ఎపిసోడ్ కి జయసుధ, జయప్రదలతో పాటు రాశిఖన్నా గెస్టులుగా వచ్చారు. ఈ ముగ్గురితో కలసి బాలయ్య చేసిన అల్లరిని, జయప్రద సెటైర్లను చూపించారు. రాశి ఖన్నా ని తెగ పొగిడేసాడు బాలయ్య. ఆమె స్మైల్ కి పడిపోయాను అంటూ సరదాగా రాశిని ఆటపట్టించారు. అనంతరం సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగి జయప్రద, జయసుధని ఇరుకున పడేసినట్లు ప్రోమో చూపించారు. ఈ ప్రోమోలో వీరసింహారెడ్డి గూరించి మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను, శృతి ప్రస్తుతం హాట్ పెయిర్ అఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు బాలకృష్ణ. హీరోయిన్ అవ్వాలంటే పరిశ్రమలో కొన్ని కాంప్రమైజ్ లు తప్పవు, హీరోయిన్ సెంట్రిక్ సినిమాలపై డబ్బులు పెట్టడానికి ప్రొడ్యూసర్లు 100 సార్లు ఆలోచిస్తారు వంటి ప్రశ్నలు సంధించారు బాలయ్య.
Next Story

