Mon Dec 23 2024 08:57:30 GMT+0000 (Coordinated Universal Time)
Unstoppable 2 : ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో.. చంద్రబాబు-లోకేష్ చెప్పిన విశేషాలేంటి ?
ఇక ఈ ట్రైలర్లో నారా చంద్రబాబు నాయుడు తన ఫ్యామిలీ, సీనియర్ ఎన్టీఆర్ గురించి, దివంగత నేత వైఎస్సార్ గురించి ఇంట్రస్టింగ్..
నందమూరి అభిమానులు, బాలకృష్ణ అభిమానులు, అన్ స్టాపబుల్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న అన్ స్టాపబుల్ -2 ఎపిసోడ్ 1 ఈ శుక్రవారం ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. తాజాగా ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది ఆహా. అందరూ ఊహించినట్టే ఈ ఎపిసోడ్ లో నారా చంద్రబాబు నాయుడు - నారా లోకేష్ లు వచ్చారు. మొదటి ఎపిసోడ్ కి తన బంధువుని పిలుద్దామనుకున్నానని, అందరి బంధువైతే బాగుంటుందని తనకు బావగారు, ప్రజా నాయకుడైన చంద్రబాబు నాయుడిని ఆహ్వానించినట్లు చెప్పారు.
ఇక ఈ ప్రోమోలో నారా చంద్రబాబు నాయుడు తన ఫ్యామిలీ, సీనియర్ ఎన్టీఆర్ గురించి, దివంగత నేత వైఎస్సార్ గురించి ఇంట్రస్టింగ్ అంశాలు చెప్పినట్లు తెలుస్తోంది. మీ లైఫ్ లో చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటని బాలకృష్ణ అడగ్గా.. మీకంటే ఎక్కువే చేశానన్నారు చంద్రబాబు. రాళ్లు, రప్పలున్న నగరాన్ని సైబరాబాద్ గా మార్చారని చంద్రబాబుని కొనియాడారు బాలకృష్ణ. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరని బాలయ్య అడగ్గా.. వైఎస్సార్ గురించి చెప్పారు. 1995లో తీసుకున్న ఓ నిర్ణయం గురించి కూడా ఇక్కడ ప్రస్తావన వచ్చింది. ఆ నిర్ణయం ఏంటన్నది తెలియాలంటే షో చూడాల్సిందే.
తర్వాత తన సోదరి భువనేశ్వరికి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పమన్నారు బాలకృష్ణ. నెక్ట్స్ నారా లోకేశ్ వచ్చారు. నారా లోకేశ్ ను కూడా బాలకృష్ణ కీలక ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. లోకేశ్ హోస్ట్ సీట్ లో కూర్చుని.. తండ్రిని- మావయ్యని ప్రశ్నలు వేశారు. ఈ శుక్రవారం టెలీకాస్ట్ అవనున్న ఈ ఎపిసోడ్ కోసం తెలుగు ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Next Story