Sun Dec 22 2024 22:57:03 GMT+0000 (Coordinated Universal Time)
Unstoppable 2 : 24 గంటలు కాకుండానే 100 స్ట్రీమింగ్ మినిట్స్ కంప్లీట్
బాలయ్య - పవన్ కల్యాణ్ ఎపిసోడ్ పార్ట్ 1 స్ట్రీమింగ్ కి వచ్చి 24 గంటలైనా కాకుండానే.. ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్
తెలుగు ఓటీటీ ప్రేక్షకులు, పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ 2 పవర్ ఎపిసోడ్ ఎట్టకేలకు నిన్నరాత్రి 9 గంటలకు ఆహా ఓటీటీ ప్లాట్ ఫాం పై స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే.. ప్రభాస్ ఎపిసోడ్ మాదిరిగానే.. పవన్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ లోనే ఎర్రర్ వచ్చింది. ఒకేసారి లక్షలాది లాగిన్ల దెబ్బకి ఆహా షేక్ అయింది. కాసేపటికి తిరిగి స్ట్రీమింగ్ మొదలైంది. రెండో సీజన్ ముగింపు ఎపిసోడ్ కి పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ లు గెస్టులుగా వచ్చారు.
తొలిభాగంలో బాలకృష్ణ.. పవన్ సినీ, వ్యక్తిగత, రాజకీయ జీవితాలతో పాటు.. కుటుంబ సభ్యుల గురించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. బాలయ్య ఎలాంటి ముచ్చట పెట్టాడా.. బాలయ్య ప్రశ్నలకు పవన్ ఎలాంటి సమాధానాలు ఇచ్చాడా అని అభిమానులతో పాటు అందరూ ఆసక్తిగా తిలకించారు. ఈ పవర్ఫుల్ ఎపిసోడ్ అప్పుడే రికార్డుల మోత మోగిస్తోంది.
బాలయ్య - పవన్ కల్యాణ్ ఎపిసోడ్ పార్ట్ 1 స్ట్రీమింగ్ కి వచ్చి 24 గంటలైనా కాకుండానే.. ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కంప్లీట్ చేసుకున్నట్లుగా ఆహా నిర్వాహకులు తెలిపారు. ఇలా ఈ టాక్ షోకు ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని తాము ముందుగానే ఊహించామని.. అందుకు తగ్గట్టుగానే ఈ ఎపిసోడ్కు ‘బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్’ అనే ట్యాగ్ ఇచ్చామని ఆహా నిర్వాహకులు తెలిపారు. ఇక ఈ టాక్ షో ఎపిసోడ్ను సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ట్రెండింగ్ చేస్తుండటంతో అన్స్టాపబుల్-2 షో కూడా నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఫిబ్రవరి 10న పార్ట్ 2 స్ట్రీమింగ్ కు వస్తుందని ఆహా టీమ్ తెలిపింది.
Next Story