Sun Dec 22 2024 22:53:19 GMT+0000 (Coordinated Universal Time)
Unstoppable 2 : బాలయ్యతో పవన్ టీజర్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పవన్
రాజకీయాలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వేసినట్లు చూపించారు. అన్నయ్య.. చిరు నుండి పవన్ ఎలాంటి మంచి, చెడు నేర్చుకున్నాడని
టాలీవుడ్ సీనియర్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా.. సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తోన్న షో అన్‌స్టాపబుల్ 2. సీజన్ 1 కంటే.. ఈ సీజన్లో బడా హీరోలను గెస్టులుగా తీసుకొస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, గోపీచంద్ లు వచ్చిన రెండు ఎపిసోడ్ లు.. బాగా హైప్ ఇచ్చాయి. రికార్డుస్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ ఎపిసోడ్ కోసం.. అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో.. ఆహా నుండి.. పవర్ టీజర్ ను వదిలారు. టీజర్ ను చూస్తే.. పవన్ ఎంట్రీ సాలిడ్ గా ఉంటుందని తెలుస్తోంది.
ఇక పవన్ తో బాలయ్య చేసిన సందడి, బాలయ్య వేసే ప్రశ్నలకు పవన్ చెప్పే సమాధానాలతో.. ఎపిసోడ్ ఇంట్రస్టింగ్ గా ఉంటుందని చెప్పకనే చెప్పారు. పవన్ ను బాలయ్య.. సినిమాలు, రాజకీయాలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వేసినట్లు చూపించారు. అన్నయ్య.. చిరు నుండి పవన్ ఎలాంటి మంచి, చెడు నేర్చుకున్నాడని బాలయ్య అడగ్గా.. దానికి పవన్ చాలా సుదీర్ఘమైన సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. మధ్యలో తన వదినకు కాల్ చేసి అదే తన లాస్ట్ సినిమా అని పవన్ చెప్పినట్లుగా తెలపడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సినిమా పరంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న పవన్ కు.. వారందరూ ఓట్లు ఎందుకు వేయడం లేదని బాలయ్య స్ట్రెయిట్ క్వశ్చన్ అడిగాడు. దీనికి పవన్ ఎలాంటి సమాధానం ఇచ్చాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Next Story