Sat Dec 21 2024 18:35:27 GMT+0000 (Coordinated Universal Time)
Unstoppable 2 : ఈరోజు రాత్రి నుండే డార్లింగ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్.. ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్
ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ మేరకు..ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్ 1ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటన చేశారు. దీంతో..
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా.. టీఆర్పీలో తిరుగులేకుండా దూసుకెళ్తోన్న Unstoppable 2లో.. ప్రభాస్-గోపీచంద్ ల ఎపిసోడ్ కోసం అభిమానులు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రను బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా చూపించిన ప్రభాస్.. ఇంటర్వ్యూ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న అభిమానులకు ఆహా టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమ్ చేయనున్నట్లు వెల్లడించిన ఆహా.. డిసెంబర్ 30న పార్ట్ 1, జనవరి 6న పార్ట్ 2 లను స్ట్రీమ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
అయితే.. ఆ షెడ్యూల్ లో చిన్నమార్పు చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ మేరకు.. ఈరోజు రాత్రి.. అంటే డిసెంబర్ 29న రాత్రి 9 గంటలకే ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్ 1ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటన చేశారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ ఎపిసోడ్‌తో ఓటీటీ రికార్డులకు ఎసరుపెట్టడం ఖాయమని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ పెళ్లి టాపిక్ పైనే అంతా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్ చేసే సినిమాలు, ఫన్నీ ఇన్సిడెంట్స్, గోపీచంద్, చెర్రీలతో కలిసి బాలయ్య చేసిన అల్లరి.. అబ్బో ఫుల్ టు పక్కా ఎంటర్టైన్ మెంట్ ఎపిసోడ్ గా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి లేదు.
Next Story