Mon Dec 23 2024 00:40:32 GMT+0000 (Coordinated Universal Time)
Unstoppable 2 : అన్స్టాపబుల్ 2 స్ట్రీమింగ్ కు టైమ్ ఫిక్స్
అన్స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్ ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ ప్రోమో టాప్ ట్రెండింగ్ లో..
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన తొలి టాక్ షో అన్స్టాపబుల్. ఈ టాక్ షో తొలి సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సూపర్ సక్సెస్ సాధించింది. తొలిసీజన్ కు ఊహించని రీతిలో ప్రేక్షకుల నుంచి స్పందన రావడంతో.. ఇప్పుడు రెండో సీజన్ ను రెడీ చేశారు నిర్వాహకులు. అన్స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్ ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ ప్రోమో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. నేటి నుంచి అన్స్టాపబుల్ 2 స్ట్రీమింగ్ అవుతుందని ఆహా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా.. తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ సమయాన్ని అనౌన్స్ చేశారు నిర్వాహకులు. ఈ షో ప్రీమియర్ను మధ్యాహ్నం 2.13 గంటలకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక రెండో సీజన్ తొలి ఎపిసోడ్కు ముఖ్య అతిథులుగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఆయన తనయుడు లోకేశ్ కలిసి వస్తున్న విషయం తెలిసిందే. ఈ టాక్ షోలో బాలయ్య చంద్రబాబును ఎలాంటి ప్రశ్నలు అడిగారు ? వాటికి చంద్రబాబు ఎలాంటి సమాధానాలిచ్చారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story