Mon Dec 23 2024 03:12:12 GMT+0000 (Coordinated Universal Time)
అన్ స్టాపబుల్ 2 ట్రైలర్.. శుక్రవారం నుంచి స్ట్రీమింగ్
అక్టోబర్ 14 నుంచి అన్ స్టాపబుల్ 2 స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ప్రతి శుక్రవారం అక్టోబర్ 14 నుంచి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
హీరోగా అయినా.. హోస్ట్ గా అయినా ప్రేక్షకులను అలరించడంలో నందమూరి బాలకృష్ణకు సాటిలేరెవ్వరు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా లో స్ట్రీమ్ అయిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 1 కు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 స్ట్రీమింగ్ కు ఆహా రెడీ అయింది. ఇటీవలే విజయవాడలో అన్ స్టాపబుల్ 2 టీజర్ ను లాంచ్ చేశారు. తాజాగా అన్ స్టాపబుల్ 2 ట్రైలర్ ను విడుదల చేసింది ఆహా.
అక్టోబర్ 14 నుంచి అన్ స్టాపబుల్ 2 స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ప్రతి శుక్రవారం అక్టోబర్ 14 నుంచి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ట్రైలర్లో నిధిని అన్వేషిస్తూ గుహలోకి వెళ్తారు బాలయ్య. అక్కడ ఎన్నో సవాల్లు.. అడ్డంకులు ఎదుర్కొని.. చివరకు నిధిని చేరుకుంటారు. అక్కడ ఉన్న ఓ బాక్స్ ఓపెన్ చేయగానే.. అందులో ఓ ఖడ్గం లభిస్తుంది. అది చేతపట్టుకుని "గెలుపే ఊపిరిగా.. పట్టుదలే ప్రాణంగా.. ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్స్టాపబుల్" ప్రశ్నల్లో మరింత ఫైర్, ఆటల్లో మరింత డేర్, సరదాల్లో మరింత సెటైర్, మీకోసం.. మరింత రంజుగా.. ఈ ట్రైలర్ తో షో పై అంచనాలు పెరిగిపోయాయి.
Next Story