Mon Dec 23 2024 14:01:19 GMT+0000 (Coordinated Universal Time)
ఉపాసనకు నాట్హెల్త్ సీఎస్ఆర్ అవార్డు
సంపూర్ణ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ పలు వీడియోలను కూడా విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఉపాసన రూపొందించిన..
హైదరాబాద్ : అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి.రెడ్డి మనుమరాలు, టాలీవుడ్ మెగాస్టార్ కోడలు, మెగా సూపర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భార్య అయిన ఉపాసనకు ప్రతిష్టాత్మక నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకున్న కొణిదెలవారి కోడలు.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. అపోలో హాస్పిటల్స్ కేంద్రం ఉపాసన.. తన వంతు బాధ్యతగా కొన్ని ప్రాజెక్టులపై పనిచేస్తోంది. వాటిలో సంపూర్ణ ఆరోగ్యం కూడా ఒకటి.
సంపూర్ణ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ పలు వీడియోలను కూడా విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఉపాసన రూపొందించిన ఓ ప్రాజెక్టును పరిశీలించిన నాట్హెల్త్ సీఎస్ఆర్ ఆమెకు 2022కు సంబంధించిన అవార్డును ప్రకటించింది. ఇటీవలే ఉపాసన ఈ అవార్డును అందుకుంది. ఈ మేరకు ఉపాసన ట్వీట్ చేస్తూ..తమ తాత ప్రతాప్ సి.రెడ్డి చెప్పే సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే దిశగా పయనిస్తున్నామన్న భావన కలుగుతోందని ఉపాసన పేర్కొంది.
Next Story