Mon Dec 23 2024 10:38:03 GMT+0000 (Coordinated Universal Time)
ఉపాసనకు కరోనా వచ్చిందట.. ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే చాలు
కరోనా సోకడంతో బాడీ పెయిన్స్, జుట్టు ఊడిపోవడం, నీరసం వంటి సమస్యలు రావచ్చని కొందరు చెప్పారు
హైదరాబాద్ : టాలీవుడ్ హీరో రామ్ చరణ్ భార్య కరోనా బారిన పడ్డారట. ఈ విషయాన్ని ఉపాసనే స్వయంగా తెలిపింది. అయితే.. ప్రస్తుతం తాను కోలుకున్నట్లు ఉపాసన ట్వీట్ చేసింది. గత వారం తనకు కరోనా వచ్చిందని, వారం రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నానని చెప్పింది. చెన్నైలో ఉన్న తన అమ్మమ్మ- తాతయ్యల వద్దకు వెళ్లేందుకు కోవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని చెప్పింది.
అంతకుముందే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు కనిపించాయని, కేవలం పారాసెటమాల్, విటమిన్ ట్యాబ్లెట్లను మాత్రం వేసుకుంటే చాలని వైద్యులు సూచించడంతో.. తాను అవే వాడినట్లు ఉపాసన తెలిపింది. కరోనా సోకడంతో బాడీ పెయిన్స్, జుట్టు ఊడిపోవడం, నీరసం వంటి సమస్యలు రావచ్చని కొందరు చెప్పారు కానీ.. తనకు అలాంటి సమస్యలేవీ రాలేదని.. చెన్నై వెళ్లే అవసరం లేకుంటే కరోనా సోకినట్లు కూడా తెలిసేది కాదన్నారు.
Next Story