Mon Dec 23 2024 06:19:38 GMT+0000 (Coordinated Universal Time)
Akira Nandan : పవన్ కోసం అకిరా ఎమోషనల్ సాంగ్.. ఉపాసన వీడియో షేర్..
పవన్ కోసం అకిరా ప్లే చేసిన ఎమోషనల్ సాంగ్ ని షేర్ చేసిన ఉపాసన.
Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్.. సినిమా ఎంట్రీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అకిరా తన లుక్స్ అండ్ చరిష్మాతో ఫ్యాన్స్ కి వింటేజ్ పవన్ ని గుర్తుకు చేస్తున్నాడు. రీసెంట్ గా అకిరా మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. బెంగళూరులోని చిరంజీవి ఫార్మ్ హౌస్ లో జరిగిన ఈ సంక్రాంతి పండుగ వేడుకలకు మెగా ఫ్యామిలీ మెంబెర్స్ అంతా హాజరయ్యి సందడి చేశారు.
ఇక ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను రామ్ చరణ్ సతీమణి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే అకిరాకి సంబంధించిన ఓ వీడియోని కూడా ఉపాసన షేర్ చేశారు. అకిరా సంగీతం నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో అకిరా కీ బోర్డు ప్లే చేస్తున్న వీడియోలను రేణూదేశాయ్ కూడా షేర్ చేశారు. ప్రస్తుతం అకిరా అమెరికాలోని ఫిలిం స్కూల్ ఈ సంగీత పాఠాలనే నేర్చుకుంటున్నాడు.
తాజాగా అకిరా తన మ్యూజిక్ టాలెంట్ ని తన ఫ్యామిలీ మెంబెర్స్ ముందు ప్రదర్శించాడు. అందుకు సంబంధించిన వీడియో ఉపాసన షేర్ చేస్తూ.. "ఫోన్ ప్రాబ్లెమ్ వల్ల సౌండ్ రికార్డు అవ్వలేదు. కానీ అకిరా ప్లే చేసింది సూపర్" అంటూ రాసుకొచ్చారు. ఇక ఆ వీడియోకి 'యానిమల్' మూవీలోని నాన్న సాంగ్ బ్యాక్గ్రౌండ్ పెట్టి.. అకిరా ప్లే చేసింది అదే అని తెలియజేసారు. ఇక ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. పవన్ కోసం అకిరా ఎమోషనల్ సాంగ్ అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
అకిరా మ్యూజిక్ టాలెంట్ చూస్తుంటే.. హీరోగా కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తాడేమో అన్న సందేహం కలుగుతుంది. రేణూదేశాయ్ కూడా అకిరాకి ప్రస్తుతం యాక్టింగ్ పై ఇంటరెస్ట్ లేదని, తనకి మ్యూజిక్ పై, ప్రొడక్షన్ పై ఇంటరెస్ట్ ఉందని చెప్పారు. దీంతో పవన్ అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారు. మరి అకిరా హీరోగా ఎంట్రీ ఇస్తాడా..? లేదా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తాడా..? అనేది చూడాలి.
Next Story