Mon Dec 23 2024 08:15:18 GMT+0000 (Coordinated Universal Time)
Vijay New Movie: విజయ్ సినిమాలో ఇంకెంత మంది స్టార్స్ చేరుతారో?
దేశంలోని బిగ్గెస్ట్ స్టార్స్ లో తలపతి విజయ్ కూడా ఒకరు. తన రాజకీయ ప్రయాణాన్ని
దేశంలోని బిగ్గెస్ట్ స్టార్స్ లో తలపతి విజయ్ కూడా ఒకరు. తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించడానికి సినిమాల నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాడు. 'తలపతి 69' విజయ్ నటుడిగా చివరి చిత్రం కానుంది. ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించబోతున్నాడు. అక్టోబర్ 4న ముహూర్తపు పూజతో ఈ చిత్రం షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించనుండగా, ఇంకా పలువురు స్టార్స్ కూడా ఈ సినిమాలో భాగమవ్వనున్నారు.
ప్రేమలు చిత్రంతో పాపులర్ అయినా మలయాళ నటి మమిత బైజు, దళపతి విజయ్‌తో కలిసి నటించబోతూ ఉంది. తలపతి 69 సినిమాలో గౌతమ్ మీనన్ కూడా భాగమయ్యాడు. గౌతమ్ మీనన్ 'లియో' తర్వాత విజయ్‌తో రెండవసారి స్క్రీన్‌ను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమణి కూడా చిత్ర తారాగణంలో చేరారు.
దళపతి 69 చిత్రీకరణ ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభం కానుందని, అక్టోబర్ 2025లో థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు మేకర్స్ ప్రకటించారు. అదనపు తారాగణం, సిబ్బందికి సంబంధించిన వివరాలతో సహా మరిన్ని ఉత్తేజకరమైన ప్రకటనలు రాబోతున్నాయని KVN ప్రొడక్షన్స్ తెలిపింది. ఈ స్టార్-స్టడెడ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని అప్డేట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కె, వెంకట్ కె.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు

Next Story