Sat Dec 21 2024 07:00:32 GMT+0000 (Coordinated Universal Time)
ఉప్పెన దర్శకుడితో రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా
వెంకట సతీష్ కిలారు నిర్మాతగా.. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై తొలి చిత్రంగా ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. మైత్రీ మూవీ..
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమైన బుచ్చిబాబు సానా.. తన రెండో సినిమా రామ్ చరణ్ తో చేయబోతున్నాడు. అది కూడా పాన్ ఇండియా సినిమా అట. మొదటి సినిమాతోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సుక్కు శిష్యుడి పంట పండింది. తన శిష్యుడు బుచ్చిబాబు సానా, హీరో రామ్ చరణ్ కాంబోలో ఓ పవర్ ఫుల్ సబ్జెక్టుతో పాన్ ఇండియా సినిమా వస్తోందని స్టార్ డైరెక్టర్ సుకుమార్ వెల్లడించారు. కొన్నిసార్లు తిరుగుబాటు అనేది అవసరంగా మారుతుంది అంటూ ఈ సినిమా కథలో ఉన్న లోతును వివరించే ప్రయత్నం చేశారు.
వెంకట సతీష్ కిలారు నిర్మాతగా.. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై తొలి చిత్రంగా ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కూడా ఈ చిత్రంలో భాగస్వాములుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత.. రామ్ చరణ్ కి కూడా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ-15ని పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో కొత్త సినిమా పట్టాలెక్కనుంది.
Next Story