Mon Dec 23 2024 11:47:05 GMT+0000 (Coordinated Universal Time)
ప్రపంచ వ్యాప్తంగా చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. షేర్ చేసిన ఉపాసన
నాటు నాటు పాటకు ఆస్కార్ రావడానికి కారణం చంద్రబోస్ లిరిక్స్ తో పాటు కీరవాణి సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. అలాగే..
ఆర్ఆర్ఆర్ సినిమాతో.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు గ్లోబల్ స్టార్ లు అయ్యారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో వీరిద్దరి పేరు మారుమ్రోగిపోతోంది. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడానికి కారణం చంద్రబోస్ లిరిక్స్ తో పాటు కీరవాణి సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. అలాగే కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సింగర్లు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ల గళంతో పాటు.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల మాస్ స్టెప్పులు ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. తాజాగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరిగాయి. అందుకు సంబంధించిన వీడియోలను ఆయన భార్య ఉపాసన ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేశారు.
న్యూయార్క్, సిడ్నీ, న్యూజెర్సీ, సింగపూర్, అట్లాంట, ఫ్రాన్స్, లాస్ ఏంజల్స్ తదితర ప్రాంతాల్లో మెగా ఫ్యాన్స్ చరణ్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన వీడియోను ఉపాసన నెటిజన్లతో పంచుకున్నారు. అలాగే చరణ్ బర్త్ డే సందర్భంగా నిర్వహించిన ఓ ఈవెంట్లో చరణ్ బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. ఆ వీడియోను కూడా ఉపాసన పంచుకున్నారు. చివర్లో లైట్లన్నీ ఆఫ్ చేసి.. మొబైల్ టార్చ్ వెలుగుల్లో.. హ్యాపీ బర్త్ డే చరణ్ అంటూ విషెస్ చెప్పారు. కాగా.. చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఆరెంజ్.. మూడ్రోజుల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 12 షోలు హౌస్ ఫుల్ అయి సరికొత్త రికార్డు సెట్ చేసింది. అంతటి డిజాస్టర్ మూవీకి ఈ రికార్డు రావడం మామూలు విషయం కాదు.
Next Story