Sun Dec 22 2024 12:13:11 GMT+0000 (Coordinated Universal Time)
కాంతార 2 లో ఊర్వశి రౌతేలా
తొలి భాగానికి ముందు జరిగిన సంఘటనలను కాంతార 2లో చూపించనున్నట్లు రిషబ్ శెట్టి చెప్పిన విషయం తెలిసిందే.
ప్రముఖ కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించి.. తానే హీరోగా రూపొందించిన సినిమా కాంతార. కేవలం రూ.16 కోట్ల ఖర్చుతో రూపొందిన ఈ సినిమా.. కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలై.. ప్రపంచ వ్యాప్తంగా. రూ.400 కోట్ల వసూళ్లు సాధించి.. అఖండ విజయాన్ని అందుకుంది. కాగా.. కాంతార కు కొనసాగింపు ఉంటుందని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ ప్రకటించారు. రిషబ్ శెట్టి ఇప్పటికే స్క్రిఫ్ట్పై పనిచేయడం మొదలుపెట్టారు.
తొలిభాగానికి ముందు జరిగిన సంఘటనలను కాంతార 2లో చూపించనున్నట్లు రిషబ్ శెట్టి చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా.. కాంతార 2 గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా నటించనుంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి బ్లాక్బస్టర్ చిత్రం ’వాల్తేరు వీరయ్య’లో ‘బాస్ పార్టీ’ పాటలో చిరంజీవితో స్టెప్పులేసి.. టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైంది ఈ బ్యూటీ. కాంతార 2 దర్శకుడైన రిషబ్ శెట్టితో కలిసి తీసుకున్న ఫోటోను ఊర్వశి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాంతార2 లోడింగ్ అని క్యాప్షన్ ఇచ్చింది. అయితే హీరోయిన్ గా నటిస్తోందా లేక ప్రత్యేక పాత్రలో కనిపిస్తుందా, స్టెప్పులేస్తుందా ? అన్న వివరాలను చెప్పలేదు.
Next Story