Mon Dec 23 2024 10:41:04 GMT+0000 (Coordinated Universal Time)
ఫస్ట్ ఇండియన్ యాక్ట్రెస్గా ఊర్వశి.. నెక్స్ట్ రిషబ్ పంత్..
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అరుదైన గౌరవం అందుకొని మొట్టమొదటి ఇండియన్ యాక్ట్రెస్ గా నిలిస్తే, నెటిజెన్స్ మాత్రం 'రిషబ్ దృష్టిలో పడేందుకేనా?' అంటూ..
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela).. స్పెషల్ సాంగ్స్ తో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాలో 'బాస్ పార్టీ' అంటూ అమ్మడి చేసిన డాన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యిపోయారు. ఈ చిత్రం తరువాత అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాలో, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ 'బ్రో'లో కూడా స్పెషల్ నెంబర్ డాన్స్ తో ఆడియన్స్ ని ఉర్రూతలూగించింది. ఇది ఇలా ఉంటే, ఈ భామ పేరు ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) విషయంలో ఎక్కువ వినిపిస్తుంది.
వీరిద్దరి ప్రేమ రూమర్ ఒకటి అప్పటిలో తెగ వైరల్ అయ్యింది. ఈ విషయంపై ఊర్వశి అండ్ రిషబ్.. తమ సోషల్ మీడియా ద్వారా ఇన్డైరెక్ట్ పోస్టులు పెడుతూ వాదించుకోవడం అప్పటిలో హాట్ టాపిక్. ఇది ఇలా ఉంటే, తాజాగా ఊర్వశి అరుదైన గౌరవం అందుకొని మొట్టమొదటి ఇండియన్ యాక్ట్రెస్ గా నిలిస్తే, నెటిజెన్స్ మాత్రం.. ''రిషబ్ దృష్టిలో పడేందుకేనా?'' ఇదంతా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ అసలు ఊర్వశి అందుకున్న అరుదైన గౌరవం ఏంటి..? ఈ సంవత్సరం వన్డే వరల్డ్ కప్ (ICC World Cup 2023) భారత్ వేదికగా జరగబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా వరల్డ్ కప్ ట్రోఫీని ఫ్రాన్స్ లోని ఈఫిల్ టవర్ వద్ద ఆవిష్కరించారు. అయితే ఈ ఆవిష్కరణ ఊర్వశి చేతులు మీదుగా జరగడం గర్వకారణం. ఈ గౌరవం అందుకున్న ఫస్ట్ ఇండియన్ యాక్ట్రెస్ గా ఊర్వశి పేరుని సంపాదించుకుంది. ఇక ఈ ఆనందాన్ని ఊర్వశి తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్.. 'రిషబ్ దృష్టిలో పడేందుకేగా' అంటూ కామెంట్స్ చేస్తుకున్నారు. మరో నెటిజెన్.. 'ఇప్పుడు ఊర్వశి తన చేతిలో వరల్డ్ కప్ ని పట్టుకుంది. నెక్స్ట్ రిషబ్ చేతిలో ఉండబోతుంది' అంటూ రాసుకొచ్చాడు. మరొకరు.. ఈసారి గెలిస్తే.. 'రెండు ట్రోఫీలు రాబోతున్నాయి' అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
Next Story