Mon Dec 23 2024 03:37:29 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి 'ఊర్వశివో రాక్షసివో'.. డిసెంబర్ 9 నుండి స్ట్రీమింగ్.. ఎందులో ?
రాకేష్ శశి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని, విజయ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్..
మెగా హీరో అల్లు శిరీష్ హీరోగా ఇటీవల వచ్చిన సినిమా 'ఊర్వశివో రాక్షసివో'. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద నిరాశే ఎదురైంది. ఇక పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించింది. శిరీష్- అనుల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయినా.. ఎందుకో జనాలు థియేటర్లో చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.
రాకేష్ శశి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని, విజయ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, శంకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. త్వరలోనే ఓటీటీ ప్రేక్షకుల కోసం ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. డిసెంబర్ 9న ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఓటీటీ ట్రైలర్ ను నెటిజన్లతో పంచుకుంది ఆహా టీమ్. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఓటీటీ ఆడియెన్స్‌ను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక అదే రోజున మరో ఫ్లాప్ మూవీ మాచర్ల నియోజకవర్గం జీ5లో స్ట్రీమ్ అవ్వనుంది.
Next Story