Sun Dec 22 2024 10:59:13 GMT+0000 (Coordinated Universal Time)
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్.. ఈసారి పెర్ఫామెన్స్ బద్ధలైపోద్ది
ఈ గ్లింప్స్.. పవన్ అభిమానులతో పాటు ప్రతి ఒకర్ని ఆకట్టుకుంది. గ్లింప్స్ లో పవన్ చెప్పిన డైలాగ్.. "ఈసారి పెర్ఫామెన్స్..
గబ్బర్ సింగ్ లో పోలీస్ గా నటించిన పవన్ కల్యాణ్ సూపట్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత అదే పోలీస్ గెటప్ లో సర్దార్ గబ్బర్ సింగ్ గా వచ్చినా అలరించలేకపోయాడు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు మళ్లీ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో ఉస్తాద్ భగత్ సింగ్ గా వస్తున్నాడు. పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ కు నేటితో 11 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు మూవీ టీమ్ రెడీ అయింది.
ఈ రోజు (మే11) ఉదయం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసిన మూవీ టీమ్ తాజాగా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్.. పవన్ అభిమానులతో పాటు ప్రతి ఒకర్ని ఆకట్టుకుంది. గ్లింప్స్ లో పవన్ చెప్పిన డైలాగ్.. "ఈసారి పెర్ఫామెన్స్ బద్ధలైపోద్ది" ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా శ్రీలీల నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది. హరీష్ శంకర్ - పవన్ కల్యాణ్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ మరోసారి వస్తుండటంతో సినిమా పాటలు, బీజీఎం లపై కూడా భారీ అంచనాలున్నాయి.
Next Story